TDP దెబ్బకు YCPలో కలవరం

ABN , First Publish Date - 2022-05-18T22:28:40+05:30 IST

టీడీపీ (TDP) మహానాడు దెబ్బకు వైసీపీ (YCP)లో కలవరం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) యాత్రలకు భారీ ప్రజాస్పందనతో వైసీపీ

TDP దెబ్బకు YCPలో కలవరం

అమరావతి: టీడీపీ (TDP) మహానాడు దెబ్బకు వైసీపీ (YCP)లో కలవరం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) యాత్రలకు భారీ ప్రజాస్పందనతో వైసీపీ సర్కార్ పోటీ యాత్ర చేస్తోంది. సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల బస్సు యాత్రకు ఉపక్రమించారు. ఈనెల 26 నుంచి నాలుగురోజుల పాటు వరుసగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రుల బస్సు యాత్రపై వైసీపీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. గడపగడపకు కొనసాగుతున్నందున బస్సు యాత్ర ఎందుకని పార్టీలో మరోవర్గం ప్రశ్నిస్తోంది. గడపగడప కార్యక్రమంలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. సభల ఏర్పాటు, బస్సు రూట్ మ్యాప్‌పై నేడు వైసీపీ అధిష్టానం సమావేశం కానుంది. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీ తర్వాత బస్సు యాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాకు ఒక బీసీ సదస్సు నిర్వహించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-05-18T22:28:40+05:30 IST