దుబాయ్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-04-21T13:06:19+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జన్మదినం వేడుకలు దుబాయ్‌లోని కరామ ప్రాంతంలో ఘనంగా జరిగాయి.

దుబాయ్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జన్మదినం వేడుకలు దుబాయ్‌లోని కరామ ప్రాంతంలో  ఘనంగా జరిగాయి. చిన్నపిల్లలు ఉల్లాసంగా కేక్‌లు కట్ చేసి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సన్మార్గంలో నడిపించాలి అంటే బాబు బ్యాక్ అనే నినాదాన్ని పాటించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసేవరకు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేఖ్ ఖాదర్ బాషా, అనురాధ ఓబిలిశెట్టి, రవికిరణ్, కందుల దుర్గాప్రసాద్, వినోద్ రెడ్డి మాదా, సూర్యదేవర సాహుల్, సుద్దాల విజేత, గరికపాటి శ్రావణి, దండు పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-21T13:06:19+05:30 IST