టీడీపీ కార్యకర్త ముచ్చట తీర్చిన చంద్రబాబు నాయుడు..

ABN , First Publish Date - 2022-02-17T19:27:21+05:30 IST

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త వేణు ముచ్చటను చంద్రబాబు నాయుడు తీర్చారు.

టీడీపీ కార్యకర్త ముచ్చట తీర్చిన చంద్రబాబు నాయుడు..

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త వేణు ముచ్చటను చంద్రబాబు నాయుడు తీర్చారు. తాను కొనుగోలు చేసిన కొత్త కారును చంద్రబాబుతో ప్రారంభించాలని వేణు కోరుకున్నారు. కారు తీసుకుని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన కొత్త కారులో కూర్చోవాలని కోరారు. అభిమాని ముచ్చటను బాబు మన్నించారు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని అభిమాని కోరిక నెరవేర్చారు. దీంతో వేణుతోపాటు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-02-17T19:27:21+05:30 IST