అమరావతి: రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, అలాగే పది గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ నాయకులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆదివారం నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. శాసనసభలో ఎస్పీ బాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు సంతాప తీర్మానాలు చేయాలని తెలిపారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, బిల్లులు, చేపట్టాల్సిన విషయాలపై నిర్ణయం తీసుకున్నారు.
అలాగే వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అసెంబ్లీకి వెళ్తారు. సమావేశాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. రాజధాని గ్రామాలు, రైతుల దీక్షా శిబిరాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.