Cinema Tickets ఆన్‌లైన్ చేయడంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2021-11-26T21:24:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే...

Cinema Tickets ఆన్‌లైన్ చేయడంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ అసెంబ్లీ కూడా ఆమోదం లభించింది. అయితే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పలువురు దీన్ని వ్యతిరేకిస్తుండగా.. ఇంకొందరు మాత్రం స్వాగతించారు. ఈ వ్యవహారంపై మొదటిసారిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.


బాబు ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీఎం వైఎస్ జగన్ ఒక మేధావి. నేడు సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్తులు అమ్మతున్నాడు.. లేదా.. తాకట్టు పెడుతున్నాడు. సీఎంకు అనుభవం లేదు.. అహంభావము మాత్రం చాలానే ఉంది. జగన్ రెడ్డి అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి లాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారు. ఇకపై తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-26T21:24:36+05:30 IST