అమరావతి: నెల్లూరు మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు నెల్లూరు నగర నేతలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై చర్చించారు. పార్టీ స్థానిక పరిస్థితులు, నేతల పనితీరుపై సమీక్ష జరిపారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాలసిన చర్యలను నాయకులకు అయన వివరించారు.