ప్రజలకు చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-04-10T15:26:16+05:30 IST

రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు  చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతి: రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.‘‘ధర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి, ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గదర్శి. కష్టసుఖాలు రెండింట్లోనూ శ్రీరాముడు నియమం తప్పలేదు. శ్రీరాముడు ప్రజల మనసెరిగి పాలించాడు. అందుకే ఈనాటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-10T15:26:16+05:30 IST