AP News: టీడీపీ నేతల అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-21T19:12:46+05:30 IST

టీడీపీ నేతల అరెస్ట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విటర్‌లో ఖండించారు. ‘‘మా పార్టీ నేతల పరామర్శకు మా వాళ్లు వెళ్తున్నారు.

AP News: టీడీపీ నేతల అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ నేతల అరెస్ట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విటర్‌లో ఖండించారు. ‘‘మా పార్టీ నేతల పరామర్శకు మా వాళ్లు వెళ్తున్నారు. దీనికి సీఎం ఎందుకు ఇంత తీవ్రస్థాయిలో భయపడుతున్నారు. శ్రీకాకుళం (Srikakulam)లో ఆంక్షలు, అరెస్ట్‌లు ఎవరికోసమో ప్రభుత్వం చెప్పాలి. అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ కేసులపై ప్రజల ప్రశ్నలను మీ అరెస్ట్‌లు అడ్డుకోలేవు. పరామర్శకు వెళ్లకూడదని ఏ చట్టం చెబుతుంది?.. ప్రభుత్వం తప్పుచేసింది కాబట్టే వణికిపోతోంది. వైసీపీ (YCP) పోలీస్ కాదు.. ఏపీ పోలీస్ (AP Police) అని గుర్తుపెట్టుకోవాలి’’ అని చంద్రబాబు హెచ్చరించారు.


పలాసలో టీడీపీ నేత గురిటి సూర్యనారాయణకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలాస వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధించారు. టీడీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని టెక్కలికి తరలించారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కూడా అరెస్టు చేసి మందస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆంక్షలు విధిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ (144 Section)  విధించారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆదివారం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ హెచ్చరించారు. 

Updated Date - 2022-08-21T19:12:46+05:30 IST