AP Assemblyలో హాట్ డిస్కషన్.. : Kodali Nani అభ్యంతరకర వ్యాఖ్యలు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన చంద్రబాబు..

ABN , First Publish Date - 2021-11-19T17:45:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడీవేడీగా సాగుతున్నాయి...

AP Assemblyలో హాట్ డిస్కషన్.. : Kodali Nani అభ్యంతరకర వ్యాఖ్యలు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన చంద్రబాబు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడీవేడీగా సాగుతున్నాయి. మొదటి రోజు అంతా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడారని టీడీపీ సభ్యులు ఆరోపించిన విషయం విదితమే. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా టీడీపీ అభ్యంతరం తెలిపింది. అయితే రెండో రోజు కూడా అదే పంథాను వైసీపీ కొనసాగించింది. ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయంపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతుండగా మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు టాపిక్ వచ్చింది. బాబు పేరును ప్రస్తావించి మరీ కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది.


కొడాలి నాని ఏమన్నారు..!?

వ్యవసాయం గురించి మంత్రి నాని మాట్లాడుతూ పదే పదే చంద్రబాబు పేరును ప్రస్తావించారు. వ్యవసాయంపై మాట్లాడుతూ.. చంద్రబాబు పేరెందుకు వస్తోందంటూ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతటితో ఆగని ఆయన ‘చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ సభ్యులు ‘చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వెంటనే కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ పట్టుబట్టింది.


బాబు రియాక్షన్ ఇదీ..

నాని వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం సహా అన్ని విషయాలపై చర్చకు సిద్దమే’ అని బాబు ఒకింత సవాలే విసిరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మరో మంత్రి కన్నబాబు.. హెరిటేజ్ సంస్థ విషయం ప్రస్తావనకు తెచ్చారు. ఇలా అటు వైసీపీ సభ్యులు.. ఇటు టీడీపీ సభ్యులు ఎవ్వరూ తగ్గలేదు. దీంతో కాసేపు సభలో గందరగోళమే నెలకొంది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని టీడీపీ సభ్యులు.. కొడాలిపై కౌంటర్ల వర్షం కురిపించారు.


కన్నబాబు కామెంట్స్ ఇవీ..

చంద్రబాబు మాట్లాడిన అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో ‘పార్టీ లేదు బొక్కా లేదన్న ఓ పార్టీ అధ్యక్షుడ్ని తొలిసారి చూస్తున్నాం. కుప్పం మా లెక్కలోకే లేదన్న అచ్చెన్న గురించి ఇంకేం మాట్లాడగలం’ అంటూ కన్నబాబు సెటైర్లు వేశారు. అంతేకాదు.. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని తట్టుకోలేరా..? అంటూ కన్నబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై టీడీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘జైలులో మీటింగ్ పెట్టుకునే పార్టీ’ అంటూ గతంలో కన్నబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇలా ఈ విషయాలే సుమారు అరగంటకుపైగా అక్కడ మంత్రులు మాట్లాడటం.. ఇక్కడ టీడీపీ తెలుగు తమ్ముళ్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతోనే సరిపోయింది.

Updated Date - 2021-11-19T17:45:09+05:30 IST