AP News: జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు పర్యటన ఆగదు: రామానాయుడు

ABN , First Publish Date - 2022-07-22T21:27:34+05:30 IST

వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన రెండో రోజు శుక్రవారం కొనసాగుతోంది.

AP News: జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు పర్యటన ఆగదు: రామానాయుడు

పశ్చిమగోదావరి (West Godavari): జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటన రెండో రోజు శుక్రవారం కొనసాగుతోంది. అయితే చంద్రబాబు పర్యటనను అడ్డుకోడానికి జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అన్ని ప్రయత్నాలు చేసిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాబు పర్యటన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా రామానాయుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలానికి సంబంధించి నాలుగు గ్రామాల వరద బాధితుల(Flood Victims)ను చంద్రబాబు పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం నరసాపురంలో పర్యటించాల్సి ఉందని, అయితే సమయాభావంవల్ల నరసాపురం పర్యటన తాత్కాలికంగా రద్దు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు పేరు చెబితే జగన్ వణుకుతున్న పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్లిన జనం నీరాజనాలు పట్టడం చూసి సీఎంకు వణుకు మొదలైందన్నారు. వైసీపీ ప్రజల మద్దతు కోల్పోయిందని పీకే సర్వే (PK survey) చెబుతోందని, ఇంటిలిజెన్స్ నివేదికలు (Intelligence reports) కూడా చెప్పడంతో ముఖ్యమంత్రి అసహనానికిలోనయ్యారని, చంద్రబాబు పర్యటనకు రకరకాల అడ్డుంకులు సృష్టిస్తున్నారని రామానాయుడు ఆరోపించారు.

Updated Date - 2022-07-22T21:27:34+05:30 IST