TDP Chief: 19ఏళ్ల తర్వాత రామయ్య సన్నిధికి చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-29T16:38:58+05:30 IST

టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

TDP Chief: 19ఏళ్ల తర్వాత రామయ్య సన్నిధికి చంద్రబాబు

భద్రాద్రి కొత్తగూడెం: టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ (Shivaji) ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. నాడు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో  శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత  టీడీపీ అధినేత ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు. 


చంద్రబాబుకు జననీరాజనం...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి భద్రాచలం చేరుకున్నారు. బూర్గంపాడు నుంచి అర్థరాత్రి ఒంటి గంటకు భద్రాచలం చేరుకున్న చంద్రబాబుకు దారిపొడవునా జననీరాజనం పలికారు. జనం ఉత్సాహం చూసి చంద్రబాబు... ఓపికగా వారితో  మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ (NTR) పేరు చరిత్రలో నిలిచి ఉంటోందన్నారు. ఐటీసీ (ITC), సింగరేణి (Singareni)కి తెలుగుదేశం పాలనలో ఎంతో ప్రోత్సాహం అందించానని గుర్తుచేశారు. హైటెక్ సిటీ (Hightech city), జీనోమ్ వ్యాలీ (Genome Valley)తో హైదరాబాద్‌ (Hyderabad)కు బ్రాండ్ ఇమేజ్ తెలుగుదేశం(TDP) పాలనలోనే వచ్చిందన్నారు. తెలుగుజాతి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణంతో తెలుగుదేశం పాలన దూరదృష్టి ఏంటో తెలిసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 


విలీన మండలాల్లో రెండోరోజు పర్యటన

మరోవైపు పోలవరం విలీన మండలాల్లో(Polavaram Merged Mandals)  చంద్రబాబు ఈరోజు రెండోరోజు పర్యటించనున్నారు. ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో బాబు పర్యటన సాగనుంది. ముంపు బాధితుల్ని పరామర్శించి వారి సమస్యలను చంద్రబాబు తెలుసుకోనున్నారు. 


చంద్రబాబును కలిసిన భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే

కాగా... చంద్రబాబును భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదేం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును పొదేం వీరయ్య విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-29T16:38:58+05:30 IST