ప్రజల కోసం శ్రమిస్తున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-21T05:38:41+05:30 IST

అధికారం ఉన్నా, లేకున్నా టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ప్రజల కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు.

ప్రజల కోసం శ్రమిస్తున్న చంద్రబాబు
కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నేతలు

  1. అధికారం ఉన్నా.. లేకున్నా ఒకే తీరు  
  2. పుట్టిన రోజు వేడుకల్లో నాయకులు
     


  కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 20: అధికారం ఉన్నా, లేకున్నా టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ప్రజల కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నా యుడు పుట్టిన రోజు సంద ర్భంగా కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగ ళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్‌ను కట్‌ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనోబలం కల్పించి, వాడవాడలా పార్టీని బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలను తయారు చేసుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబేనని, అలాంటి నాయకుడి పుట్టినరోజును పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, ఎన్నికలను ఎదుర్కోవడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరని అన్నారు.
 

రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి పదవిలోకి తెచ్చేందుకు అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఒక విజన్‌తో రాష్ట్రాన్ని పాలించి, రాబోయే కాలంలో రాష్ట్రంలో విద్యావంతులకు ఒక మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. ఈరోజు రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళుతోందని, చంద్రబాబు వేసిన బాటే అందుకు కారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని, ఏదో ఒకనాడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేంద్రకుమార్‌, అబ్బాస్‌, పార్వతమ్మ, రవికుమార్‌, హనుమంతరావు చౌదరి, జేమ్స్‌, బాల వెంకటేశ్వరరెడ్డి, చంద్రకాంత్‌, సత్రం రామక్రిష్ణుడు, భాస్కర్‌ రెడ్డి, తిరుపాల్‌బాబు, రాజు యాదవ్‌, నంది మధు తదితరులు పాల్గొన్నారు.
 

Updated Date - 2021-04-21T05:38:41+05:30 IST