
Amaravathi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహానాడు విజయవంతం కావడంతో చంద్రబాబు ముఖ్యనేతలతో మాట్లాడుతూ.. ఒంగోలు మహానాడు ప్రజా విజయమన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు వేదిక అయ్యిందన్నారు. ప్రకాశం జిల్లా నేతలను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని పేర్కొన్నారు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని.. క్విట్ జగన్ సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి