15 వరకు చంద్రగిరి కోట మూత

ABN , First Publish Date - 2021-04-17T07:07:53+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పురావస్తుశాఖ పరిధిలోని చంద్రగిరి కోటను శుక్రవారం మూతవేశారు.

15 వరకు చంద్రగిరి కోట మూత
కోటను మూసి వేస్తున్నట్లు గేటుకు అంటించిన నోటీసు

కల్యాణ వెంకన్న ఆలయంలోనూ భక్తులకు దర్శనం రద్దు


చంద్రగిరి, ఏప్రిల్‌ 16: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో స్మారక కట్టడాలు, పురావస్తు శాఖ పరిధిలోని పర్యాటక స్థలాలు, ప్రదర్శనశాలన్నింటినీ మే 15వ తేదీవరకు మూసి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పురావస్తుశాఖ పరిధిలోని చంద్రగిరి కోటను శుక్రవారం మూతవేశారు. దీనికి సంబంధించిన నోటీసును గేటుకు అంటించారు. అలాగే శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా భారతీయ పురావస్తుశాఖ పరిధిలో ఉంది. అందువల్ల ఈ ఆలయంలోనూ భక్తులకు వచ్చేనెల 15వ తేదీవరకు దర్శనాన్ని రద్దు చేశారు. 



Updated Date - 2021-04-17T07:07:53+05:30 IST