Ranji Trophy : మధ్యప్రదేశ్ కోచ్ Chandrakant Pandit భావోద్వేగం.. 23 ఏళ్లక్రితం ఇదే మైదానంలో బాధతో కన్నీళ్లు..

Published: Sun, 26 Jun 2022 19:29:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Ranji Trophy : మధ్యప్రదేశ్ కోచ్ Chandrakant Pandit భావోద్వేగం.. 23 ఏళ్లక్రితం ఇదే మైదానంలో బాధతో కన్నీళ్లు..

బెంగళూరు : దేశవాళీ ప్రతిష్టాత్మక ‘రంజీ ట్రోఫీ(Ranji Trophy)’ని 41 సార్లు ముద్దాడిన ముంబై(Mumbai)ని ఓడించి చరిత్రలో తొలిసారి మధ్యప్రదేశ్(Madya pradesh) జట్టు ట్రోఫీని కైవశం చేసుకుని భళా అనిపించుకుంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం(chinaswammy stadium) వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ చివరి రోజు ఆదివారం బ్యాట్స్‌మెన్ రజత్ పటీదార్ విన్నింగ్ షాట్ కొట్టగానే మధ్యప్రదేశ్ జట్టు ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్(Chandrakanth pandit) భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న ఆనందబాష్పాలను ఆపుకోలేకపోయారు. ఎందుకంటే సరిగ్గా 23 ఏళ్లక్రితం ఇదే మైదానంలో చేదు ఫలితంతో కన్నీళ్లతో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 1998-99 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక(karnataka)పై 96 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ ఓటమిపాలైంది.  కెప్టెన్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే 1950లో మధ్యప్రదేశ్ జట్టు ప్రారంభమయ్యాక ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఆ ఏడాది ఫైనల్‌కు చేరడమే. కొన్ని నెలల శ్రమంతో ఫైనల్ చేరినప్పటికీ ఫైనల్‌లో అనూహ్య ఓటమితో ఆయన ఉత్తచేతులతో  వెనుదిరగాల్సి వచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యం లభించినా మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఓటమిని చవిచూసింది. 


ఆటగాడిగా చేయలేనిది.. కోచ్‌గా చేసి చూపాడు..

ఆటగాడిగా మధ్యప్రదేశ్‌కు టైటిల్ అందించలేకపోయినప్పటికీ.. ముంబై, విదర్భ జట్లకు కోచ్‌గా వ్యవహరించి టైటిల్స్ గెలవడంలో చంద్రకాంత్ పండిట్ సహకారం అందించారు. కానీ సొంత జట్టుకు ట్రోఫీని అందించడం ఆయనకు కలగానే మిగిలింది. అయితే 2020-21లో మధ్యప్రదేశ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే కొవిడ్ కారణంగా ఆ సీజన్‌లో రంజీ ట్రోఫీ జరగలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది టైటిల్‌ని కొట్టి ఆయన కలనేర్చుకున్నారు. ఈ ఏడాది సీజన్‌లో కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను సగర్వంగా నిలపడంలో మధ్యప్రదేశ్ ఆటగాళ్లు రజత్ పటీదార్, యష్ దూబే, శుభం శర్మ కుమార్ కార్తికేయ, గౌరవ్ యాదవ్ కీలకపాత్ర పోషించారు. బ్యాట్స్‌మెన్లు చక్కగా పరుగులు చేయగా.. బౌలర్లు స్థిరంగా వికెట్లు తీసి జట్టుకు తొలి టైటిల్‌ని అందించారు. 


ఇది 23 ఏళ్ల కల    

మ్యాచ్ గెలుపు అనంతరం కన్నీళ్లు కార్చుతున్న కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను ఆటగాళ్లు భూజాలపైకెత్తుకున్నారు. దీంతో 23 ఏళ్లుగా తన గుండెళ్లో ఉన్న భారాన్ని ఆటగాళ్లు తుడిచివేసినట్టయింది. మ్యాచ్ అనంతరం చంద్రకాంత్ పండిట్ మాట్లాడారు. ‘‘ 23 ఏళ్లక్రితం మిగిలిపోయిన గొప్ప జ్ఞాపకం ఇది. మళ్లీ ఇక్కడే ట్రోఫీ గెలవడం దేవుడి దీవెన. ఈ ట్రోఫీని గెలవడం అత్యద్భుతం. ఇదే మైదానంలో కెప్టెన్ తాను కోల్పోయిన దక్కడం భావోద్వేగమైన విషయం’’ అని ఆయన అన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పనిచేయడం తనకు ఇష్టమన్నారు. కాగా అసలు ఏమాత్రం అంచనాల్లేని మధ్యప్రదేశ్ జట్టును ఈ ఏడాది విజయతీరాలకు చేర్చడం వెనుక కోచ్(coach) చంద్రకాంత్ పండిట్(Chandrakant Pandit) ముఖ్యభూమిక పోషించాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు విదర్భ ఏకంగా 4 ట్రోఫీలు గెలిచింది. రంజీ, ఇరానీ ట్రోఫీలను వరుసగా గెలిపించిన ఘనత ఆయనకే దక్కింది. తాజా విజయంతో కోచ్‌గా ఆయన ఖాతాలో మొత్తం 6 రంజీ ట్రోఫీలు చేరినట్టయ్యింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.