పనితీరు మార్చుకోండి

ABN , First Publish Date - 2022-05-29T05:47:55+05:30 IST

‘జిల్లాలోని చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జీరో ప్రసవాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోండి. రానున్న 10 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి వైద్యులను హెచ్చరించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.

పనితీరు మార్చుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో మీనాక్షి

- లేదంటే చర్యలు తప్పవు
- ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలి
- వైద్యులను హెచ్చరించిన డీఎంహెచ్‌వో
అరసవల్లి, మే 28:
‘జిల్లాలోని చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జీరో ప్రసవాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.  ఇప్పటికైనా పనితీరు మార్చుకోండి. రానున్న 10 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి వైద్యులను హెచ్చరించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల్లో నిమ్మాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుకబడి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. వైద్యులు పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని, ఇకపై బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తున్నామని తెలిపా రు. ఏఎన్‌ఎంలు 18 రిజిష్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. గర్భిణులకు నెలకోసారి వైద్యులతో పరీక్షలు చేయించాలని, వారికి ఐరన్‌ మాత్రలు అందించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జననీ సురక్ష, ప్రధానమంత్రి మాతృ వందన పథకాల ద్వారా గ్రామీణ ప్రాంత గర్భిణులకు రూ.1000, పట్టణప్రాంత గర్భిణులకు రూ.600, ప్రసవ సమయంలో రూ.5వేలు అందిస్తున్న విషయాన్ని వారికి తెలియజేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు, సేవలపై అవగాహన లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, వలంటీర్ల సమన్వయంతో పనిచేసి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఫీవర్‌ సర్వే, గర్భిణుల వివరాలు నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో అనూరాధ, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త బి.ప్రకాశరావు,  జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, వైద్యాధికారులు కె.అప్పారావు,   జె.కృష్ణమోహన్‌, మాస్‌ మీడియా అధికారి పి.వెంకటరమణ, జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి వీవీ అప్పలనాయుడు  తదితరులు పాల్గొన్నారు.
 

Updated Date - 2022-05-29T05:47:55+05:30 IST