గ్రామాల రూపురేఖలు మార్చండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-16T05:15:10+05:30 IST

: గ్రామాల్లో నిర్మిస్తున్న సచివాలయ, రైతు భరోసా, అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ క్లీనిక్‌ల పనులను పూర్తి చేసి పల్లెల రూపు రేఖలను మార్చాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు.

గ్రామాల రూపురేఖలు మార్చండి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, జూన్‌ 15: గ్రామాల్లో నిర్మిస్తున్న సచివాలయ, రైతు భరోసా,  అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ క్లీనిక్‌ల పనులను పూర్తి చేసి పల్లెల రూపు రేఖలను మార్చాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం   మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరె న్స్‌లో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణాలపై ఈ నెల 17 నుంచి పక్సోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అధి కారులు  క్షేత్రస్థాయిలో ఈ పనులు తనిఖీ చేసి నివేదికలు అందించా లని ఆదేశిం చారు. కార్యక్రమంలో జేసీ ఆర్‌.శ్రీరాములునాయుడు, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు జడ్పీ సీఈవో బి. లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

ఈ-పంటలో నమోదు కావాలి: జేసీ

 రైతులు ఈ-పంటలో నమోదు కావాలని జేసీ సుమిత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన  జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు. ఈ-పం టలో నమోదైతేనే  ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం, రాయితీలు, ఇతర సదుపాయాలు పొందుతారన్నారు. వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్‌ మాట్లాడుతూ, పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వరి, మొక్కజొ న్నలను గ్రామ యూనిట్‌గా, వేరుశనగ, చెరుకులను మండల యూనిట్‌గా, గంటేలను జిల్లా యూనిట్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వంశధార ఎస్‌ఈ డి.తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.  


 


Updated Date - 2021-06-16T05:15:10+05:30 IST