'సలార్' కథలో మార్పులు..?

Jul 25 2021 @ 09:22AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'సలార్' ఒకటి. ఈ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర కథలో చిన్న చిన్న మార్పులు చేశారనే టాక్ వినిపిస్తోంది. కొన్ని అదనపు సన్నివేశాలతో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేశారట. ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం 'సలార్' చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.