ఈ ఏడాది ప్రారంభంలో `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. దాని తర్వాత డైరెక్టర్ పరశురామ్‌తో `సర్కారు వారి పాట` సినిమా అనౌన్స్ చేశాడు. కథ ప్రకారం ఈ సినిమాను అధిక భాగం అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. పరశురామ్, అతని టీమ్ ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసి, వెనక్కి తిరిగి వచ్చారు. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలనుకున్నారు. అయితే వీసాల సమస్య కారణంగా షూటింగ్ మరికొంత కాలం వాయిదా పడింది.
ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ భయం మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్లాన్ మార్చిందట. తొలుత హైదరాబాద్‌లోనే చిత్రీకరణను ప్రారంభిస్తారట. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించి ఇక్కడ షూట్ చేయాల్సిన సీన్లను ముందుగా పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఫిబ్రవరి లేదా మార్చిలో అమెరికా షెడ్యూల్‌ను ప్రారంభిస్తారట. వరుసగా 45 రోజులు అక్కడే షూటింగ్ జరుపుతారట.