వైద్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం శోచనీయం

ABN , First Publish Date - 2022-09-24T05:25:17+05:30 IST

రెండున్నర దశా బ్దాల క్రితం ఆనాటి ప్రభుత్వం నామకరణ చేసిన ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరును నేటి ప్రభు త్వం అర్ధంతరంగా తొలగించడం సహేతుకం కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

వైద్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం శోచనీయం
ముప్పవరంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ 

ముప్పవరంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం

పంగులూరు, సెప్టెంబరు 23:  రెండున్నర దశా బ్దాల క్రితం ఆనాటి ప్రభుత్వం నామకరణ చేసిన ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరును నేటి ప్రభు త్వం అర్ధంతరంగా తొలగించడం సహేతుకం కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ నెలకొల్పి ఆయన పేరుతో కొనసాగుతున్న వైద్య విశ్వ విద్యాలయానికి ఆయన పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ పేరును పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య పై శుక్రవారం మండలంలోని ముప్పవరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గొట్టిపాటి సారథ్యంలో పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ జాతీయ రహదారిపై బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముప్పవరం ప్రధాన కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం రవికుమార్‌ మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహణీయుడు ఎన్టీఆర్‌ అని అన్నా రు. వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరును మార్చడం సభ్యస మాజం సహించదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిల వాల్సిన చట్టసభ ప్రజావ్యతిరేక విధానాలకు, విలువలకు తిలోదకాలిచ్చే వేదికగా మారడం శోచనీయమ న్నారు. 

కార్యక్రమంలో పార్టీ మండల అ ధ్యక్షుడు రావూరి రమేష్‌, కేవీ సు బ్బారావు, బాలిన రామసుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల స హదేవుడు, బెల్లంకొండ దశరధ, గు ర్రం ఆదిశేఖర్‌, మస్తాన్‌వలి, కోమటి ప్రసాద్‌, అల్లంనేని బ్రహ్మానందస్వా మి, వరపర్ల సుబ్బారావు, ఉన్నం ర విబాబు, పిచ్చిరెడ్డి, ఆదిరెడ్డి, శివరా జు, జగన్‌, జాగర్లమూడి పూర్ణ, హ రికృష్ణ నార్నె సుబ్బారావు తదితరు లు పాల్గొన్నారు.


ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తెలుగుజాతికే అవమానం

ఇంకొల్లు, సెప్టెంబరు 23: విజయవాడలోని వైద్య విశ్వవిద్యాల యానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తెలుగుజాతికే అవమానమని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు అన్నారు. శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  నాగులచెరువు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో  పాలేరు రామకృష్ణ, వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకట్రావు, హనుమయ్య, కొల్లూరి రాంబాబు తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:25:17+05:30 IST