చాణక్య నీతి: అలాంటివారు అసూయాపరులు.. వారిని దూరం పెట్టండి!

ABN , First Publish Date - 2022-06-04T11:31:54+05:30 IST

ఆచార్య చాణక్య తన జీవితంలో పొందిన...

చాణక్య నీతి: అలాంటివారు అసూయాపరులు.. వారిని దూరం పెట్టండి!

ఆచార్య చాణక్య తన జీవితంలో పొందిన అనుభవాలను 'చాణక్య నీతి'లో ప్రస్తావించాడు. చాణక్య నీతి 17 అధ్యాయాలతో కూడిన పుస్తకం. ఆచార్య చాణక్యుడు రాజకీయాలు, దౌత్యంలో నిష్ణాతుడు, ఆర్థిక శాస్త్ర పండితుడు. తన జ్ఞానాన్ని తనకే పరిమితం చేసుకోకుండా ఆ జ్ఞానాన్ని చాణక్య నీతిరూపంలో భావి తరాలకు అందించాడు. చాణక్య విధానాలు మనల్ని జీవితంలోని ఇబ్బందుల నుండి బయటపడేయటానికి ఉపయోగపడతాయి. చాణక్య తెలిపిన ప్రకారం ఎవరికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.


జ్ఞానులు తోటి జ్ఞానులపై అసూయపడతారు, తప్పు మార్గంలో నడిచే స్త్రీ పవిత్ర స్త్రీని చూసి అసూయపడుతుంది. అదేవిధంగా ఒక వికారరూపం కలిగిన స్త్రీ అందమైన స్త్రీని చూసి అసూయపడుతుంది. పక్షులలో కాకి, జీవులలో నక్క తెలివైనది. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం రేగు చెట్టుకు గల అన్ని పండ్లు ఒకేలా ఉండవు. అదేవిధంగా ఒకే గర్భంలో, ఒకే నక్షత్రంలో జన్మించిన వ్యక్తులంతా ఒకేరీతిలో ఉండరు. వేద జ్ఞానాన్ని ఖండించేవారు, శాస్త్రోక్తమైన జీవనశైలి. శాంతియుత స్వభావం గల వ్యక్తులను ఎగతాళి చేసేవారు దుఃఖాన్ని పొందుతారు. పేదలు సంపదను కోరుకుంటారు. ధనవంతులు స్వర్గాన్ని కోరుకుంటారు. దేవతలు మోక్షాన్ని కోరుకుంటారు. కామానికి మించిన బాధాకరమైన వ్యాధి లేదు, మోహానికి మించిన శత్రువు, కోపానికి మించిన అగ్ని ఎక్కడా లేవు. ప్రకృతి అందించే జ్ఞానానికి మించిన జ్ఞానం ఎక్కడా లేదు. 

Updated Date - 2022-06-04T11:31:54+05:30 IST