పైరవీకారులకే పట్టం!

ABN , First Publish Date - 2020-11-30T04:58:52+05:30 IST

పోలీసు శాఖలో సమర్థవంతమైన అధికారులకు గుర్తిం పు లభించడంలేదు. బదిలీ నుంచి పోస్టింగ్‌ల వరకు అంతా పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ప్రజాప్రతిని ధులు, ఉన్నతాధికారుల కనుసన్నలలో పోస్టింగ్‌లు జరుగు తున్నాయి. నిజాయితీగా పనిచేసే అధికారులను లూప్‌ లైన్ల లో వేస్తూ.. పైరవీలు చేసుకున్నవారికి మంచి పోలీసు స్టేష న్లలో పోస్టింగ్‌లు ఇస్తున్నారు.

పైరవీకారులకే పట్టం!

పోలీసు శాఖలో సమర్థతకు గుర్తింపు కరువు

నిజాయితీగా పనిచేసేవారికి లూప్‌లైన్‌లే దిక్కు

పైరవీలు చేసుకునే వారికే  కీలక పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లు

చేరినప్పటి నుంచే ‘వసూళ్ల’పై దృష్టి

ఉమ్మడి జిల్లాలో వరుస ఘటనలు

రెండు నెలల్లో ఏసీబీకి చిక్కిన ముగ్గురు సీఐలు

ప్రత్యేక దృష్టి సారించిన ఉన్నతాధికారులు

బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్న వైనం

నిజామాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పోలీసు శాఖలో సమర్థవంతమైన అధికారులకు గుర్తిం పు లభించడంలేదు. బదిలీ నుంచి పోస్టింగ్‌ల వరకు అంతా పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ప్రజాప్రతిని ధులు, ఉన్నతాధికారుల కనుసన్నలలో పోస్టింగ్‌లు జరుగు తున్నాయి. నిజాయితీగా పనిచేసే అధికారులను లూప్‌ లైన్ల లో వేస్తూ.. పైరవీలు చేసుకున్నవారికి మంచి పోలీసు స్టేష న్లలో పోస్టింగ్‌లు ఇస్తున్నారు. పైరవీల ద్వారా పోస్టింగ్‌ పొం దినవారు స్టేషన్‌లో చేరినప్పటి నుంచే పెట్టినదానికి రెండిం తలు పొందేవరకు దందా కొనసాగిస్తున్నారు. ఇలా మా మూళ్ల దందా పెరిగి చివరకు ఏసీబీకి పట్టుపడుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పట్టుబడిన ముగ్గురు సీఐల ఉ దంతాన్నే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు 

పైరవీలు చేసుకున్నవారికే ఫలితం

ఉమ్మడి జిల్లా పరిధిలో గడిచిన ఐదేళ్ల నుంచి పోలీసు శాఖలో పైరవీలు చేసుకున్నావారికే మంచి పోలీస్‌ స్టేషన్లు దక్కుతున్నాయి. ఎస్‌ఐ, సీఐ నుంచి ఏసీపీ, డీఎస్పీల వరకు ఇదే పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధు ల కనుసన్నలలోనే పోస్టింగ్‌లు దక్కుతున్నాయి. వారి ద్వారా నే అనుకున్న పోలీసు స్టేసన్లు, సర్కిల్స్‌, సబ్‌ డివిజన్‌ల పో స్టింగ్‌లు పొందుతున్నారు. పైరవీలు చేసుకోలేక.. సమర్థవం తంగా పనిచేస్తున్న అధికారులు మాత్రం లూప్‌ లైన్లలో పో స్టింగ్‌లు పొందుతున్నారు. ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తు న్నారు. లా అండ్‌ ఆర్డర్‌కు రావడం లేదు. పైరవీలు చేసుకు నే అధికారులు ఆ నియోజకవర్గం పరిధిలో కానీ, పక్క ని యోజకవర్గంలో కానీ పోస్టింగ్‌ పొందుతున్నారు. రాజకీయ నేతల అండదండలు ఉండడం, పైరవీల ద్వారా పోస్టింగ్‌లు పొందడంతో వచ్చినప్పటి నుంచే వారు దందాలు మొదలు పెడుతున్నారు. అన్నీ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. సాధారణ కేసుల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వరకు వసూళ్లు చే స్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌, ఇసుక అక్రమ రవాణా వంటివి ఏ కేసు వచ్చినా.. వదలడం లేదు. చివరకు స్టేషన్‌ బేయిళ్లకు ఇంత అని వసూలు చేస్తున్నారు. కొన్ని స్టేషన్ల పరిధిలో కొం తమందిని నియమించుకుని వసూళ్లు చేస్తున్నారు. చివరకు ఏసీబీకి పట్టుబడుతూ తమ శాఖకు మచ్చ తెస్తున్నారు. గ తంలో లాగా నేరాలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. దొంగతనాలు, నేరాలు పెరుగుతున్నా అరికట్టడం లేదు. గ తంలో దొంగతనాలు జరిగితే కొద్ది రోజుల్లోనే నిందితులను పట్టుకునేవారు. ప్రస్తుతం నెలలుగడిచినా నిందితుల ఆచూ కీ దొరకడం లేదు. పోలీసు అధికారులు డబ్బులు వచ్చే కే సులపై మాత్రమే దృష్టిపెట్టడం వల్ల నేరాలు అదుపులోకి రావడం లేదు.

గతంలో సమర్థులకే కీలక బాధ్యతలు

గతంలో పోలీసు శాఖలో సమర్థవంతంగా పనిచేసేవారి కే కీలకమైన పోస్టింగ్‌లను ఇచ్చేవారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడంతో పాటు నక్సల్‌ ఆపరేషన్‌లలో కీలకంగా వ్యవహరించే అధికారులకు ప్రధాన పోలీసు స్టేషన్లలో పోస్టి ంగ్‌లను ఇచ్చేవారు. బదిలీల సమయంలోనూ ఎస్పీలు పార దర్శకంగా వ్యవహరించి.. పనిచేసేవారికే పట్టం కట్టేవారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసేవారు. బది లీ చేసే సమయంలో ఎస్బీ, ఇంటలిజెన్స్‌ వారి నివేదికలను తీసుకుని వారి ట్రాక్‌ రికార్డు ఆధారంగా పోస్టింగ్‌లను ఇచ్చే వారు. సరిహద్దుల వద్ద నేరాలను అరికట్టేందుకు కీలకమైన అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చేవారు. ఆ స్టేషన్లలో పోస్టింగ్‌ లు పొందిన అధికారులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. నేరాలను అరికట్టడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేవారు. ప్రస్తుతం ఎవరు.. ఎప్పుడు బదిలీ అవుతున్నారో తెలియడం లేదు. పైరవీ చేసుకున్నవారికి ప్ర స్తుతం ఉన్న చోట కనీసం రెండు సంవత్సరాలు పూర్తి కావా లన్న నిబంధనను కూడా పట్టించుకోకుండానే ఎస్‌ఐ, సీఐల బదిలీలు జరుగుతున్నాయి. చివరకు సబ్‌ డివిజన్‌ అధికారు ల పోస్టింగ్‌లు కూడా ఇదే విధంగా జగుతున్నాయి. చివరకు సమర్ధవంతంగా పనిచేసే అధికారులు పైరవీలు చేసుకోవ డం ఇష్టం లేకపోవడంతో సీఐడీ, ఇంటటలిజెన్స్‌, పోలీసు అ కాడమి, ట్రాన్స్‌కో, ఏసీబీ, ఎస్‌బీ వంటి శాఖలలో పనిచేస్తు న్నారు. ఏళ్ల తరబడి అందులోనే ఉంటున్నారు. చివరకు ప దోన్నతులు వచ్చిన వారిని కూడా అందులోనే కొనసాగిస్తు న్నారు. రాజకీయంగా పోస్టింగ్‌లు పొందిన అధికారులు  కొ న్ని సమయాలలో ఉన్నతాదికారుల ఆదేశాలు కూడా పట్టిం చుకోవడం లేదు. గతంలో ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా పనిచేసి న అధికారి ఎస్‌ఐలను వారి ట్రాక్‌ రికార్డు ఆధారంగా బదిలీ చేస్తే రాజకీయ పైరవీలు చేసుకుని నిలిపివేశారు. ఆ అధికా రి ఒప్పుకోకపోవడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు 

కొన్ని మార్పులు చేసి పోస్టిం గ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపి ంచడం లేదు. పైరవీలు చేసుకున్న అధికారులకు సమయం లేకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నా రు. దీని వల్ల శాఖలోని అధి కారులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల తర్వాత బదిలీలు?

ఉమ్మడి జిల్లాలో రెండు నెలలకాలంలో ముగ్గురు సీఐలు ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో ఆ శాఖ ఉన్నతాధికారు లు కూడా కిందిస్థాయి అధికారుల పనితీరుపై దృష్టిపెట్టిన ట్లు తెలుస్తోంది. గతంలో వీరితో పాటు మరికొంత మంది అధికారులపై నిఘావర్గం ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తున్న ట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది అధికారులను బదిలీ చేసేందుకు సిద్ధ మవుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా పరిధిలో ము ఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను బదిలీ చే సే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేరాలు పెరుగుతున్న స మయంలో సమర్థులైన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తే అవ సరం ఉన్న వారికి సేవలు అందే అవకాశం ఉంది.

Updated Date - 2020-11-30T04:58:52+05:30 IST