‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షురూ చేసిన చరణ్

Jun 21 2021 @ 11:19AM

పాన్ ఇండియా ప్రెస్టీజియ‌స్ మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. కొవిడ్ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో స్టార్ట్ చేశారు. ఈ విష‌యాన్ని రామ్‌చ‌ర‌ణ్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ‘‘లాక్‌డౌన్ 2.0ను ఎత్తివేసిన త‌ర్వాత సినిమాల షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్‌కు హెయిర్ స్టైల్ చేయ‌డం ద్వారా నా రోజు ప్రారంభ‌మైంది. మ‌నంద‌రి ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుంటే, ఎన్టీఆర్ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.