Advertisement

తమిళ దర్శకుడితో చరణ్?

Oct 22 2020 @ 09:42AM

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాలో నటిస్తున్నాడు. అలాగే స్టార్ డైరెక్టర్ కొరాటల శివ రూపొందిస్తున్న `ఆచార్య`లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇవి తప్ప చెర్రీ భవిష్యత్తు సినిమాల గురించి వార్తలేం రాలేదు. అయితే లాక్‌డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెర్రీకి కథలు చెప్పినట్టు సమాచారం. 


`ఆర్ఆర్ఆర్` తర్వాత వెంటనే మరో పాన్ ఇండియా సినిమా చేయాలని చెర్రీ అనుకుంటున్నాడట. అలాంటి కథలనే వింటున్నాడట. ఈ నేపథ్యంలో తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా చెప్పిన కథ చెర్రీకి నచ్చిందట. చెర్రీ నటించిన `ధృవ` సినిమా మాతృక `తనీ ఒరువన్`ను మోహన్ రాజానే రూపొందించారు. స్టైలిష్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్న మోహన్ రాజా, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం.   

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.