చరణ్ - సుక్కు కాంబోలో 'రంగస్థలం 2'..?

Apr 23 2021 @ 11:38AM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో 'రంగస్థలం' మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. అంత అద్భుతమైన సినిమాని చరణ్‌కి సుకుమార్ ఇచ్చాడు. కమర్షియల్ స్టార్ హీరోగా చరణ్‌కి ఉన్న ఇమేజ్ పక్కన పెట్టి 'రంగస్థలం' సినిమాతో సుకుమార్, చరణ్ ఇద్దరు పెద్ద రిస్క్ చేశారని చెప్పాలి. చరణ్‌ని వినికిడి లోపం ఉన్న పాత్రలో అభిమానులు, ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహం ఏమాత్రం లేకుండా కథ మీద నమ్మకంతో సుకుమార్ తీసిన 'రంగస్థలం' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిట్టిబాబుగా చరణ్ పర్ఫార్మెన్స్‌కి అభిమానులు..ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ సినిమా చూసిన టాలీవుడ్ హీరోలు.. మాకు అలాంటి కథ కావాలి.. రెడీ చేసి చెప్పండి.. చేద్దాం అని సుకుమార్‌ని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. అంతగా 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు పాత్ర ఆకట్టుకుంది. 

 

కాగా మరోసారి చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయన్న తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదికూడా 'రంగస్థలం' సినిమాకి సీక్వెల్ అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్.. ఆలు అర్జున్‌తో 'పుష్ప' తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న.. 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నట్టున్నాడు సుకుమార్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ .. రామ్ చరణ్‌తో 'రంగస్థలం' సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాల తర్వాత క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో సుకుమార్ 'రంగస్థలం 2' సినిమా ఉండే ఆకాశాలున్నాయని సమాచారం.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.