Chartered Accountants' Day : దేశ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లది కీలక పాత్ర

ABN , First Publish Date - 2022-07-01T20:43:05+05:30 IST

దేశ నిర్మాణం, ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్రను గుర్తు చేసుకుంటూ

Chartered Accountants' Day : దేశ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లది కీలక పాత్ర

న్యూఢిల్లీ : దేశ నిర్మాణం, ఆర్థికాభివృద్ధిలో  చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్రను గుర్తు చేసుకుంటూ ఏటా జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డేను నిర్వహిస్తారు. పార్లమెంటు చట్టం ద్వారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. ఈ ఏడాది 74వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. 


మన దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని క్రమబద్ధీకరించేందుకు పార్లమెంటు చట్టం ద్వారా Institute of Chartered Accountants of India (ICAI)ను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. ఇది ప్రపంచంలో రెండో అతి పెద్ద ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ బాడీ. ఫైనాన్షియల్ ఆడిట్స్, అకౌంటింగ్ ప్రొఫెషన్ క్రమబద్ధీకరణ, లైసెన్సింగ్ కోసం మన దేశంలో ఉన్న ఏకైక సంస్థ ఇది. మన దేశంలో అత్యంత ప్రాచీన ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఇదే.


చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949; చార్టర్డ్ అకౌంటెంట్స్ రెగ్యులేషన్స్, 1988 ప్రకారం 40 మంది సభ్యులు ఈ సంస్థను నిర్వహిస్తారు. 32 మంది సభ్యులను చార్టర్డ్ అకౌంటెంట్లు ఎన్నుకుంటారు. మిగిలిన ఎనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 


చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్‌ను క్రమబద్ధీకరించడంతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు బోధన, పరీక్షల నిర్వహణ, అకౌంటింగ్ ప్రమాణాల రూపకల్పన, ప్రామాణిక ఆడిటింగ్ విధానాలను నిర్దేశించడం, నైతిక ప్రమాణాలను విధించడం, క్రమశిక్షణ అధికార పరిధిని వినియోగించడం, విధానపరమైన అంశాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం వంటి పనులను ఐసీఏఐ చేస్తుంది. 


Updated Date - 2022-07-01T20:43:05+05:30 IST