ఎయిర్‌పోర్టులో చాట్‌బాట్‌ స్టోర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-03T05:00:58+05:30 IST

ఎయిర్‌పోర్టులో చాట్‌బాట్‌ స్టోర్‌ ప్రారంభం

ఎయిర్‌పోర్టులో చాట్‌బాట్‌ స్టోర్‌ ప్రారంభం
ఏర్పాటు చేసిన డ్యూటీ ఫ్రీ చాట్‌బాట్‌ స్టోర్‌

  • వాట్సాప్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ ద్వారా షాపింగ్‌
  • అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఉపయోగం : జీఎంఆర్‌

శంషాబాద్‌రూరల్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం జీఎంఆర్‌  డ్యూటీ ఫ్రీ విధానానికి శ్రీకారం చుట్టింది. వాట్సాప్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ చాట్‌ బాట్‌ స్టోర్‌ను బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీ స్‌ ఉద్దేశం వ్యాపార కార్యకలాపాలను  సులభతరం చేయడం. అంతర్జాతీయ ప్రయాణికులు వాట్సాప్‌ ద్వారా వివిధ కేటగిరిల్లో లభించే 100 అంతర్జాతీయ బ్రాండ్లు కలిగిన వస్తువులను షాపింగ్‌ చేయడం కోసం చాట్‌బాట్‌ సర్వీసు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మాత్ర మే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 2.7 బిలియన్ల వినియోగదారులున్న వాట్సాప్‌ ఈ కొత్త చాట్‌బాట్‌ కస్టమర్లతో ఎంగేజ్‌ కావడానికి చాల అనుకూలమైందని, బలమైన సంబంధాలను పెంచుకోవడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. ప్రయాణికులు 72729 93377 నెంబర్‌కు వాట్సాప్‌ చేయాలని సూచించారు. వాట్సా్‌పలోనే వివిధ బ్రాండ్లకు సంబంధించిన వివరాలు అడగవచ్చని తక్కువ సమయంలో సమాధానం వస్తుందని వివరించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాపారులు తిరిగి పుంజుకోవడానికి  చాట్‌బాట్‌ సర్వీసు ఉపయోగపడుతుందని జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ అన్నారు. 

Updated Date - 2020-12-03T05:00:58+05:30 IST