టీకాతో మహమ్మారికి చెక్‌

ABN , First Publish Date - 2021-01-17T06:09:14+05:30 IST

కరోనా వ్యాక్సీన్‌ వచ్చినప్పటికీ ప్రజలు మరికొన్ని రోజులు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు.

టీకాతో మహమ్మారికి చెక్‌
గిద్దలూరు వైద్యశాలలో టీకా వేస్తున్న వైద్యుడు నయబ్‌


గిద్దలూరు టౌన్‌, జనవరి 16 : కరోనా వ్యాక్సీన్‌ వచ్చినప్పటికీ ప్రజలు మరికొన్ని రోజులు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. మండలంలోని కేఎ్‌సపల్లె ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా నివారణ వ్యాక్సిన్‌ను ఆయన ప్రారంభించారు. మొదటిగా ఆసుపత్రిలోని 18 మంది వైద్యసిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాంబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని నెలల పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. వైద్యసిబ్బంది ముందుండి చర్యలు చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్నారు. వ్యాక్సీన్‌ వచ్చినప్పటికీ మరికొన్ని రోజులు మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్‌ పాలుగుళ్ళ ప్రతా్‌పరెడ్డి, తహసీల్దార్‌ రాజారమేష్‌ ప్రేమ్‌కుమార్‌, ఎంపీడీవో రంగనాయకులు, గిద్దలూరు మున్సిపల్‌ కమిషనర్‌ హేమావతి, కేఎ్‌సపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ నాయబ్‌రసూల్‌, వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కంభం : కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కంభం ప్రభుత్వ వైద్యశాలలో శనివారం 10 మంది సిబ్బందికి మొదటి విడత వ్యాక్సిన్‌ వేశారు. అంతకుముందు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు  వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని వైద్యశాలలో రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన రాంబాబు కొవిడ్‌-19 టీకా పని తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలను డాక్టర్‌ శశికాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. టీకాను ముందుగా ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల వారికి విడతల వారిగా వేస్తారన్నారు. వారు  మిగిలిన ప్రజల్లో ధైర్యం నింపారన్నారు. గిద్దలూరు వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూరిబాబు పర్యవేక్షణలో మొదట కంభం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శశికాంత్‌, తరువాత హెడ్‌నర్సు పద్మ, ఇతర 10 మంది సిబ్బందికి టీకా వేసిన తరువాత అరగంట వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కార్యక్రమంలో కంభం తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎస్సై మాధవరావు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఏలం వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్‌ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ జడ్‌పిటిసి సయ్యద్‌ జాకీర్‌, మాజీ ఎంపిపి కొత్తపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. 

త్రిపురాంతకం : కొవిడ్‌ వ్యాక్సిన్‌ను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ప్రారంభించారు. ముందుగా వైద్యశాల సీహెచ్‌వోకు వ్యాక్సిన్‌ వేశారు. అనంతరం 20 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమంలో వైద్యుడు నాగేశ్వరనాయక్‌, తహసీల్దారు కిరణ్‌, ఎంపీడీవో సుదర్శనం, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

 ఎర్రగొండపాలెం : పట్టణంలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలకు 25 మందికి కరోనావ్యాక్సిన్‌ డోసులు శనివారం వేశారు. కార్యక్రమాన్ని మార్కాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎం.శేషిరెడ్డి ప్రారంభించారు.  మొదటగా ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాసరావుకు  కరోనావ్యాక్సిన్‌ డోస్‌ను వైద్యాధికారి డాక్టర్‌ పాల్‌ వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌లో ఆరు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. మార్కాపురం మున్సిపాలిటిలో 2, గిద్టలూరు 1,  కంభం 1, ఎర్రగొండపాలెం 1, త్రిపురాంతకం పీహెచ్‌సీ 1 వ్యాక్సిన్‌ కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలిపారు. మొదటి రోజు డివిజన్‌లో 200 మందికి వ్యాక్సిన్‌ డోస్‌లు వేస్తున్నారని తెలిపారు.  కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఎం.పద్మావతి, ఇన్‌చార్జ్‌ తహసీల్దారు వి వీరయ్య, ప్రభుత్వ డాక్టర్లు పి.చంద్రశేఖర్‌, వి.సురేష్‌, కోటేనాయక్‌, సక్రునాయక్‌, ఎస్‌ ఓ పీసీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షణాధికారి మౌలా, పంచాయతి కార్యదర్శి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:09:14+05:30 IST