సొసైటీ వ్యవస్థాపకుడిని మోసగించారని కేసు

ABN , First Publish Date - 2021-04-24T05:25:49+05:30 IST

విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిం చాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపకుడిని మోసం చేశారని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదయింది.

సొసైటీ వ్యవస్థాపకుడిని మోసగించారని కేసు

తాడేపల్లిగూడెం రూరల్‌. ఏప్రిల్‌ 23: విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిం చాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపకుడిని మోసం చేశారని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కెనడాలో ఇంజనీర్‌గా పనిచేసే చిట్యాల కృష్ణ మూర్తి తన స్నేహితులతో కలిసి 1982లో తాడేపల్లిగూడెం మండలం మాధవ రంలో చిట్యాల ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించారు. ఆ సమయంలో విశాఖ కు చెందిన స్నేహితుడు, బంధువైన చిట్యాల అయ్యన్నను నిర్వాహకుడిగా, మరో ఇద్దరిని డైరెక్టర్‌లుగా కృష్ణమూర్తి ఏర్పాటు చేశాడు. 1984లో కృష్ణమూర్తి మృతి చెందడంతో ట్రస్ట్‌లోని సొమ్ముతోపాటు కెనడా డాలర్లు 6.30 లక్షల సొత్తును ట్రస్ట్‌ నిబంధనలకు విరుద్దంగా వాడుకోవడమే కాకుండా ఆయన భార్యకు ఇవ్వలేదని కృష్ణమూర్తి బావమరిది సుబ్బారావు పేటకు చెందిన అడ పా సూర్యప్రకాశరావు కోర్టు ద్వారా న్యాయం కోసం కేసు వేశాడు. ఈ మేరకు ఎస్‌ఐ గుర్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

Updated Date - 2021-04-24T05:25:49+05:30 IST