మహిళా టైలర్లకు మోసం

ABN , First Publish Date - 2021-03-03T06:25:29+05:30 IST

కుట్టుమిషన్ల ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మాయమాటలు చెప్పి ఎక్కువ జీతం ఇస్తామని నమ్మబలికి ఆరు నెలలు వెట్టిచాకిరి చేయించుకుని చేతులెత్తేసిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం వెలుగు చూ సింది.

మహిళా టైలర్లకు మోసం

-పోలీసుల అదుపులో నిర్వాహకుడు 

లేపాక్షి, మార్చి 2: కుట్టుమిషన్ల ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మాయమాటలు చెప్పి ఎక్కువ జీతం ఇస్తామని నమ్మబలికి ఆరు నెలలు వెట్టిచాకిరి చేయించుకుని చేతులెత్తేసిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం వెలుగు చూ సింది. సాల్మనరాజ్‌ అనే వ్యక్తి లేపాక్షికి వచ్చి ఒక షెడ్డును ఏర్పాటుచేసి అందులో 10 కుట్టు మిషన్లను ఏర్పాటు చేశాడు. మహిళా టైలర్లు రోజూ కుట్టుపనికి వచ్చి జీన్స బట్టలను కుడితే నెలకు రూ.6వేలు వేతనం చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇది నమ్మిన మహిళా టైలర్లు రోజూ కుట్టుపనికి వెళ్లారు. ఆరు నెలలు పనిచేయించుకున్న అతను కేవలం రెండు నెలల జీతాలు మాత్ర మే చెల్లించాడు. మిగిలిన జీతం వాయిదా వేస్తూ వచ్చాడు. మంగళవారం ఇతని మాటలు నమ్మని టైలర్లు కుట్టుమిషన కేంద్రం వద్ద గొడవకు దిగారు. దీంతో పోలీసులకు బాధితులు ఫోన ద్వారా సమాచారం ఇవ్వగా అక్కడి చేరుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితులు లిఖితపూర్వకంగా ఎస్‌ఐ సద్గురుడుకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-03-03T06:25:29+05:30 IST