21 ఏళ్ల క్రితం ‘చీటింగ్ పరీక్షలు’... ఇన్నాళ్లకు ఫలితాలు వెల్లడి!

ABN , First Publish Date - 2022-06-30T16:31:15+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో 21 ఏళ్ల క్రితం నలుగురు టీచర్లు.. బోర్డ్ పరీక్షలో విద్యార్థులు కాపీ కొట్టేందుకు సహకరించగా ఇప్పుడు ఆ టీచర్లకు కోర్టు శిక్ష విధించింది.

21 ఏళ్ల క్రితం ‘చీటింగ్ పరీక్షలు’... ఇన్నాళ్లకు ఫలితాలు వెల్లడి!

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో 21 ఏళ్ల క్రితం నలుగురు టీచర్లు.. బోర్డ్ పరీక్షలో విద్యార్థులు కాపీ కొట్టేందుకు సహకరించగా ఇప్పుడు ఆ టీచర్లకు కోర్టు శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది. బోర్డు పరీక్షల్లో కాపీ కొట్టిన కేసులో 21 సంవత్సరాల తర్వాత నలుగురు టీచర్లకు రూ. 1.500 రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఈ టీచర్లు అదనంగా 7 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 


వివరాల్లోకి వెళితే 21 సంవత్సరాల క్రితం, ఏప్రిల్ 9, 2001 న న్యూ మండి కొత్వాలి ప్రాంతంలోని వేద పుత్రి పాఠశాల ఇంటర్ కాలేజీలో బోర్డు పరీక్షలు జరిగాయి. ఈ సమయంలో నలుగురు టీచర్లు విద్యార్థులు కాపీ కొట్టి పరీక్ష రాసేందుకు సహకరించారు. సహరాన్‌పూర్ మండల్ విద్యాశాఖ డైరెక్టర్ ఈ టీచర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపధ్యంలో వైదిక్ పుత్రి పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ గోయల్ కొత్త మండి స్టేషన్‌లో టీచర్లు కమణి, రీటా, అర్చన, ఉషలపై కేసు పెట్టారు. ఈ కేసులో 21 ఏళ్ల తర్వాత కోర్టు టీచర్లు కమణి, రీటా, అర్చనలకు 1500 రూపాయల జరిమానా విధించింది. జరిమానాను సకాలంలో చెల్లించకపోతే, వారందరికీ అదనంగా 7 రోజుల జైలు శిక్ష విధించనున్నారు. కాగా ఈ టీచర్లలో ఒకరైన ఉషా గుప్తాపై కోర్టు ఇంకా తీర్పు వెలువరించాల్సివుంది. ఈ కేసు గురించి ముజఫర్‌నగర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ రామ్ అవతార్ సింగ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 9, 2001న నయీ మండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బోర్డు పరీక్షల సమయంలో నలుగురు ఉపాధ్యాయులు గైడ్ సాయంతో పిల్లల చేత కాపీ చేయించారు. వీరిని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సహారన్‌పూర్ బోర్డు పట్టుకుంది. ప్రిన్సిపాల్ సంతోష్ గోయల్ వారిపై కేసు నమోదు చేశారన్నారు. 

Updated Date - 2022-06-30T16:31:15+05:30 IST