పదోన్నతికి కచ్చితమైన అర్హతలు పరిశీలించండి : డీఈవో

ABN , First Publish Date - 2022-10-08T05:04:27+05:30 IST

పదోన్నతులకు కచ్చితమైన అర్హతలు, సీనియారిటీ పరిశీలించాలని డీఈవో పురుషోత్తం ఆదేశాలు జారీ చేశారు.

పదోన్నతికి కచ్చితమైన అర్హతలు పరిశీలించండి : డీఈవో
ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్న డీఈవో పురుషోత్తం

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 7: పదోన్నతులకు కచ్చితమైన అర్హతలు, సీనియారిటీ పరిశీలించాలని డీఈవో పురుషోత్తం ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్థానిక డీఈవో సమావేశ మందిరంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ)ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలైంది. స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందడంతో పాటు సీనియారిటీ జాబితా ఆధారంగా అన్ని అర్హతలను పరిశీలించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఉర్దూ మీడియంలో ఎస్‌ఏ మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ, ఉర్దూ) సబ్జెక్టులకు సంబంధించి టీచర్ల అర్హతలను పరిశీలించారు. డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి సబ్జెక్టుల వారిగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. పరిశీలన పూర్తి చేసిన వారి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరచాలని, అభ్యంతరాలను తగిన ఆధారాలతో శనివారం సాయంత్రం లోపు వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్‌లో అప్‌లోడ్‌ చేయాలనిడీఈవో ఆదేశించారు. 10న స్కూల్‌ అసిస్టెంట్‌ సీనియారిటీ జాబితా, 12, 13 తేదీలలో పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు డీఈవో తెలిపారు. 



Updated Date - 2022-10-08T05:04:27+05:30 IST