నెబ్యులైజర్‌ మందుతో కరోనా పునరుత్పత్తికి చెక్‌

ABN , First Publish Date - 2021-03-06T08:14:26+05:30 IST

కరోనా పునరుత్పత్తి ప్రక్రియను నిరోధించగల సరికొత్త చికిత్సా పద్ధతిని అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానం క్రిస్పర్‌ (సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌) టెక్నాలజీపై

నెబ్యులైజర్‌ మందుతో కరోనా పునరుత్పత్తికి చెక్‌

వాషింగ్టన్‌, మార్చి 5: కరోనా పునరుత్పత్తి ప్రక్రియను నిరోధించగల సరికొత్త చికిత్సా పద్ధతిని అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానం క్రిస్పర్‌ (సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌) టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ‘సీఏఎ్‌స13ఏ’ అనే ప్రొటీన్‌ను సాధారణంగా ఆర్‌ఎన్‌ఏ వైర్‌సలు లక్ష్యంగా వినియోగిస్తుంటారు. పునరుత్పత్తి కోసం కరోనా.. ఆర్‌ఎన్‌ఏ జెనెటిక్‌ కోడ్‌ను వాడుకుంటుంది. ఈ కోడ్‌లోని ఏ భాగాన్ని ప్రొటీన్‌ లక్ష్యంగా చేసుకోవాలి? నిర్వీర్యమయ్యేలా అందులో ఏవిధమైన మార్పులు చేయాలి? అనే సమాచారాన్ని గైడ్‌ స్ట్రాండ్‌లో పొందుపరుస్తారు. ఈ గైడ్‌ స్ట్రాండ్‌ను జతపర్చిన ‘సీఏఎ్‌స13ఏ’ ప్రొటీన్‌ ఔషధాన్ని నెబ్యులైజర్‌ ద్వారా తీసుకోవచ్చు. ఇది ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి  కరోనా వైరస్‌ పునరుత్పత్తికి చెక్‌ పెడుతుంది. ఫ్లూ వైర్‌సల పునరుత్పత్తిని నిలువరించేందుకూ ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

Updated Date - 2021-03-06T08:14:26+05:30 IST