కోడిగుడ్డుతో కరోనాకు చెక్‌!

ABN , First Publish Date - 2022-07-19T16:13:52+05:30 IST

కరోనా స్పైక్‌ ప్రొటీన్‌(Corona spike protein) మన కణాల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేసే

కోడిగుడ్డుతో కరోనాకు చెక్‌!

లాస్‌ఏంజెలెస్‌, జూలై 18: కరోనా స్పైక్‌ ప్రొటీన్‌(Corona spike protein) మన కణాల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేసే యాంటీబాడీలను.. కాలిఫోర్నియా వర్సిటీ(University of California) (యూసీ డేవిస్‌) పరిశోధకుల బృందం కోడిగుడ్ల(Eggs)లో అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనలో భాగంగా వారు మూడు వేర్వేరు టీకాలను రెండేసి డోసుల చొప్పన కోళ్లకు ఇచ్చారు. టీకా చివరిడోసు ఇచ్చిన 3, 6వారాల తర్వాత ఆ కోళ్లు పెట్టిన గుడ్లలోని పచ్చసొనలో, రక్తంలో యాంటీబాడీలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించారు. వాటిని శుద్ధి చేసి.. అవి కరోనా వైరస్‌ కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోగలుగుతున్నాయో లేదో ల్యాబ్‌లో మానవ కణాలపై పరీక్షించారు. అవి సమర్థంగా అడ్డుకోగలుగుతన్నట్టు నిర్ధారించుకున్నారు.  సాధారణంగా పక్షి జాతుల్లో ఉత్పత్తి అయ్యే ‘ఐజీవై’ రకం యాంటీబాడీలను.. మనుషుల్లో ‘ఐజీజీ’ రకం యాంటీబాడీలతో పోల్చవచ్చు. ఐజీవై రకం యాంటీబాడీలను మనుషుల శరీరాల్లోకి ప్రవేశపెట్టినా వాటిపై రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించదు. వాటివల్ల అలర్జీలు రావు. ఇవి పక్షుల సీరమ్‌లోను, గుడ్లలోనూ ఉంటాయి. ఈ యాంటీబాడీలతో.. కరోనా బాధితులకు, వైర్‌సకు ఎక్స్‌పోజ్‌ అయినవారికి చికిత్స చేయవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విధానంలో తక్కువ ఖర్చుతోనే యాంటీబాడీలను తయారుచేయొచ్చని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న యూసీ డేవిస్‌ ప్రొఫెసర్‌ రోడ్రిగో గలార్డో తెలిపారు. 

Updated Date - 2022-07-19T16:13:52+05:30 IST