నిరీక్షణకు ‘చెక్‌’

ABN , First Publish Date - 2021-05-26T05:44:14+05:30 IST

ఎట్టకేలకు సర్పంచ్‌ల చెక్‌పవర్‌ జారీ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం విధానంలో మార్పులు చేస్తున్నారు. ముందుగా సర్పంచ్‌లకు ఐడీ నంబర్లు కేటాయిస్తున్నారు. తొలుత 156 మందికి ఐడీలు క్రియేట్‌ చేశారు. వారం రోజుల్లో మిగతా వారి పేరుతో రూపొందించేందుకు సన్నాహాలు చేశారు. సర్పంచ్‌లకు గతంలో చెక్‌ పవర్‌ ఉండేది. కాని సీఎఫ్‌ఎంఎస్‌ విధానం అమల్లోకి రావడంతో ప్రతి బిల్లు దాని ద్వారానే వెళ్లేది. దీంతో చెక్‌ ఇవ్వాల్సిన పనిలేకుండా పోయింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ క్రియేట్‌ చేయాల్సి ఉండగా... ఇంత వరకూ ప్రక్రియ పూర్తికాలేదు. సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి చాలా రోజులు కావస్తున్నా వారికి ఈ ఐడీ క్రియేట్‌ కాకపోవడంతో గ్రామాల్లో పనులకు, బిల్లులు పెట్టడానికి వీల్లేకుండా పోయింది. జిల్లాలో 1,164 పంచాయతీల్లో నూతన పాలక వర్గాలు కొలువుతీరాయి. గతంలో పంచాయతీలకు ప్రత్యేకాధికారులు ఉండగా.... వారికి సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌లకు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ క్రియేట్‌ చేయాలి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు.. సర్పంచ్‌లకు ఐడీ క్రియేట్‌ చేయడంలో

నిరీక్షణకు ‘చెక్‌’






సర్పంచ్‌లకు ఐడీ నెంబర్లు

చెక్‌ పవర్‌ విధానంలో మార్పులు

సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు చెల్లింపులు

తొలుత 156 మందికి...

వారం రోజుల్లో మిగతా వారికి..

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఎట్టకేలకు సర్పంచ్‌ల చెక్‌పవర్‌ జారీ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం విధానంలో మార్పులు చేస్తున్నారు. ముందుగా సర్పంచ్‌లకు ఐడీ నంబర్లు కేటాయిస్తున్నారు. తొలుత 156 మందికి ఐడీలు క్రియేట్‌ చేశారు. వారం రోజుల్లో మిగతా వారి పేరుతో రూపొందించేందుకు సన్నాహాలు చేశారు. సర్పంచ్‌లకు గతంలో చెక్‌ పవర్‌ ఉండేది. కాని సీఎఫ్‌ఎంఎస్‌ విధానం అమల్లోకి రావడంతో ప్రతి బిల్లు దాని ద్వారానే వెళ్లేది. దీంతో చెక్‌ ఇవ్వాల్సిన పనిలేకుండా పోయింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ క్రియేట్‌ చేయాల్సి ఉండగా... ఇంత వరకూ ప్రక్రియ పూర్తికాలేదు. సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి చాలా రోజులు కావస్తున్నా వారికి ఈ ఐడీ క్రియేట్‌ కాకపోవడంతో గ్రామాల్లో పనులకు, బిల్లులు పెట్టడానికి వీల్లేకుండా పోయింది. జిల్లాలో 1,164 పంచాయతీల్లో నూతన పాలక వర్గాలు కొలువుతీరాయి. గతంలో పంచాయతీలకు ప్రత్యేకాధికారులు ఉండగా.... వారికి సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌లకు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ క్రియేట్‌ చేయాలి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు.. సర్పంచ్‌లకు ఐడీ క్రియేట్‌ చేయడంలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పారిశుధ్య పనులు చురుగ్గా చేపట్టాల్సిన అవసరముంది. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌ చేయాలి. మూలకు చేరిన రక్షిత మంచినీటి పథకాలు, పైపులైన్లు బాగుచేయాలి. వీటిన్నింటికీ సర్పంచ్‌లు సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీ ఖాతాల్లో నిధులున్నా ఖర్చు చేయలేని స్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా చెక్‌ పవర్‌ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. 


వారం రోజుల్లో..

 సర్పంచ్‌లకు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీని క్రియేట్‌ చేస్తున్నాం. ఈ విషయంపై ఎంపీడీవోలకు అవగాహన కల్పించాం. జిల్లా ట్రెజరీ అధికారితో పాటు ఇతర  అధికారులతో చర్చించాం. వారం, పది రోజుల్లో సర్పంచ్‌లందరికీ ఐడీ క్రియేట్‌ చేసే కార్యక్రమం పూర్తి చేస్తాం.

- రవికుమార్‌, డీపీవో, శ్రీకాకుళం



Updated Date - 2021-05-26T05:44:14+05:30 IST