లో బీపీ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే..

ABN , First Publish Date - 2022-04-04T16:56:41+05:30 IST

రక్తపోటు పెరిగితే ప్రమాదమని అందరికీ తెలుసు. అయితే రక్తపోటు సాధారణ స్థాయిలకంటే తగ్గినా ముప్పే. లో బీపీ సమస్య ఉన్నట్లయితే ఇదిగో ఇలా చేయండి.

లో బీపీ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే..

రక్తపోటు పెరిగితే ప్రమాదమని అందరికీ తెలుసు. అయితే రక్తపోటు సాధారణ స్థాయిలకంటే తగ్గినా ముప్పే. లో బీపీ సమస్య ఉన్నట్లయితే ఇదిగో ఇలా చేయండి.


రోజు కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల బీపీ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవచ్చు. తులసి ఆకుల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియంలో బీపీని సాధారణ స్థాయికి తీసుకురావడంలో సహాయపడతాయి.

తులసిలో ఉండే యుజినాల్‌ అనే కాంపోనెంట్‌ లో బీపీని సాధారణ స్థాయికి తీసుకురావడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వేసవి సీజన్‌లో మజ్జిగ ఎంతో మంచిది. అంతేకాదు, బీపీ తక్కువగా ఉన్నట్టు అనిపించినప్పుడు మజ్జిగ తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. మజ్జిగలో కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్రపొడి చిటికెడు వేసి తీసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్య దూరం కావడంతో పాటు లో బ్లడ్‌ప్రెషర్‌ కూడా సరి వుతుంది.

ఒక గ్లాసు నిమ్మరసం తాగినా లో బీపీ సమస్య తగ్గిపోతుంది. శరీరంలో ఫ్లూయిడ్స్‌ బాగా తగ్గిపోయినప్పుడు రక్తపోటు పడిపోతుంటుంది. అలాంటప్పుడు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.

ప్రతిరోజు కాఫీ తాగండి. కాఫీలో ఉండే కెఫిన్‌ రక్తపోటును పెంచుతుంది. అసౌకర్యంగా అనిపించినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీని తాగండి.

చిన్న అల్లం ముక్క నమలడం, గోరువెచ్చటి నీళ్లలో దాల్చిన చెక్కపొడి వేసుకుని తాగడం, పాలు, ఖర్జూర తీసుకోవడం, టొమాటో, ఎండుద్రాక్ష, క్యారెట్‌ వంటివి తినడం వల్ల లో బీపీ సమస్యను దూరం చేసుకోవచ్చు.

Updated Date - 2022-04-04T16:56:41+05:30 IST