పోషక లోపానికి చెక్‌

ABN , First Publish Date - 2022-06-27T06:23:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేం ద్రాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులకు క్రీడలతో పాటు విద్య, పోషకాహారం అం దించి పోషణ లోపానికి చెక్‌ పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసు కుం టోంది.

పోషక లోపానికి చెక్‌

అంగన్‌ వాడీల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఆటా పాటలతో పాటు...పుష్టిపై దృష్టి

అంగన్‌వాడీ కేంద్రాల్లో 52 వేలకు పైగా చిన్నారులు

జగిత్యాల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేం ద్రాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులకు క్రీడలతో పాటు విద్య, పోషకాహారం అం దించి పోషణ లోపానికి చెక్‌ పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసు కుం టోంది. అంగన్‌వాడీలకు వచ్చే పిల్లల ఆరోగ్యం మరింత ప్రత్యేక శ్రద్ధ వ హించడానికి నిర్ణయించింది. కేంద్రాల్లో విద్యార్థుల శారీరక ఎదుగుదల, ఆరోగ్యం ఎలా ఉంటుందో ప్రభుత్వం సమాచారం సేకరించ దలిచింది. ఇప్పటివరకు పాటిస్తున్న విధానాలకు మరింత మెరుగులు దిద్ది ప్రతీ చి న్నారి పేరిట ప్రొఫైల్‌ తయారు చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి అదే శాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఆరు నెలల నుంచి మూడేళ్ల వ యస్సున్న చిన్నారులకు అవసరమైన పోషకాహారాన్ని అందించడానికి చ ర్యలు తీసుకుంటున్నారు. 

జిల్లాలో మాతా శిశు పరిస్థితి...

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల ద్వారా మా తా శిశు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జగిత్యాల, ధర్మపురి, మె ట్‌పల్లి, మల్యాల పరిధిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో 1,065 అంగన్‌వాడీ కేం ద్రాలున్నాయి. ఇందులో 1,037 ప్రధాన అంగన్‌ వాడీ కేంద్రాలు, 28 మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలోని కేంద్రాల్లో 15,400 మంది గర్భిణులు, బాలింతలున్నారు. అంగన్‌ వాడీల్లో 52,286 మంది చిన్నారులు నమోదై ఉన్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల్లో చిన్నారు లు 36,006 మంది, 3 ఏళ్ల నుంచి 5 సంవత్స రాల్లోపు చిన్నారులు 16,280 మంది ఉన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు కుంటోంది. 

పిల్లల్లో పోషణా లోపం అధిగమించేందుకు...

పల్లె, పట్టణాల్లోని పిల్లందరూ సాధారణ స్థితిలో ఉండాలన్నది ప్రభు త్వ లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. పోషణా లోపం అధికంగా ఉన్న చిన్నా రులను గుర్తించి వారికి తగిన పౌష్టిక ఆహారాన్ని అందించి చిన్నారులను సాధారణ స్థితిలోకి తేనున్నారు. ప్రతీ చిన్నారి ఆరోగ్యకరంగా ఎదిగేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి తగిన అవగాహన కల్పించడానికి ప్రయ త్నిస్తున్నారు. గర్బిణులు ప్రసవం వరకు నాలుగు పర్యాయాలు, బాలిం తలు 42 రోజుల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షలకు వెళ్లి వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని ప్రచారం చేస్తున్నారు. తద్వా రా పుట్టబోయే, పుట్టిన చిన్నారులను పుష్టిగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.

మూడు రకాలుగా గుర్తింపు...

అంగన్‌ వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను మూడు రకాలుగా గుర్తి స్తున్నారు. సాధారణ, తక్కువ స్థాయిలో ఉన్న పిల్లలను మామ్‌గా, తీవ్రత ఎక్కువ ఉన్న చిన్నారులను సామ్‌గా గుర్తిస్తున్నారు. ప్రతీ నెల అయి దేళ్లలోపు ఉన్న వారి ఎత్తు, బరువు, చుట్టుకొలతను పరిశీలించి వారి స్థితి ని తెలుసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ఎత్తుకు తగి న బరువు కేటగిరిని అనుసరించి లోపాన్ని పరిగణలోకి తీసుకుంటున్నా రు. జిల్లా వ్యాప్తంగా 0 నుంచి 5 ఏళ్లలోపు గల మొత్తం పిల్లలు 52, 286 మంది ఉన్నారు. పిల్లల ఎదుగుదల సాధారణ స్థితిలో ఉన్న సంఖ్య 48,919గా గుర్తించారు. మామ్‌ కేటగిరి కింద 2,455 మంది చిన్నారులు, సామ్‌ కేటగిరి కింద 912 మంది చిన్నారులను స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్తించారు.

ఆకలి నిర్ధారణ పరీక్షలు...

అంగన్‌ వాడీల్లో సామ్‌గా గుర్తించిన చిన్నారులకు మాత్రమే ఆకలి ని ర్ధారణ పరీక్షలు చేస్తారు. మామ్‌గా గుర్తించిన చిన్నారులకు ఆకలి నిర్దార ణ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. 7 నుంచి 18 నెలల చిన్నారులకు కనీసం 15 గ్రాముల ప్లస్‌ బాలామృతం తిన్నట్లయితే ఆకలి పరీక్షల్లో ఉత్తీ ర్ణులైనట్లు లెక్కిస్తారు. 19 నుంచి 36 నెలల లోపు చిన్నారులు 30 గ్రాము ల బాలామృతం, 37 నుంచి 59 నెలల చిన్నారులు 45 గ్రాముల బాలా మృతం తింటే ఆకలి నిర్ధారణ పరీక్ష పాసైనట్లుగా భావిస్తున్నారు. ఇందు కు తక్కువగా తింటే సామ్‌గా గుర్తించి వైద్యుల సలహా పాటించాలని తె లియజేస్తారు. ఈ వివరాలను ప్రతీ నెల ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వెంటనే తగిన పరీక్షలు నిర్వహించి వారిని సాధారణ స్థితి వచ్చే మందు లు, పోషక విలువలున్న ఆహారాన్ని అందజేయాలని సూచిస్తున్నారు.

ప్లస్‌ బాలామృతంతోనే...

పిల్లల్లో పోషణ విలువను పెంచేందుకు ప్లస్‌ బాలామృతం కొత్తగా ప్రా రంభించారు. సామ్‌ పిల్లలకు బాలామృతం ప్లస్‌తో పాటు పాలు, కోడి గు డ్లు, అన్ని రకాల విటమిన్లు ఖనిజన లవణాలు ఉన్న పోషక ఆహారాన్ని అందజేస్తారు. వీరికి ప్రతీ రోజు నాలుగు పర్యయాలు బాలామృతం ప్లస్‌ ఇస్తారు. మామ్‌ పిల్లల విషయంలో బాలామృతం ప్లస్‌ను ప్రతీ రోజు రెం డు పర్యాయాలు ఇస్తారు. ఇంట్లో వండిన ఆహార పదార్థాలను పెడుతుం టారు. మొదటి నెల నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతీ పక్షం రోజులకు ఒక పర్యాయం అంగన్‌వాడీ టీచర్‌ పర్యవేక్షిస్తుంటారు.

బలవర్థక ఆహారం ఇలా..

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్బిణులకు, బాలింతలకు, చిన్నారులకు ప్రతీ రోజు  అన్నం, పప్పు, గుడ్లు, పాలు ఇస్తున్నారు. ప్రతీ కేంద్రంలో సరాసరి 8 నుంచి 15 మంది వరకు గర్బిణులు, బాలింతలు ఉంటున్నారు. చిన్నా రులు సైతం ఇదే స్థాయిలో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. గర్భిణులకు, బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, 200 మిల్లీ గ్రాముల పాలు, ఒక కోడి గుడ్డుతో ఒక పూట భోజనం అందిస్తున్నారు. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల ప ప్పు, 5 గ్రాముల నూనె, ఒకటి కోడి గుడ్డుతో ఒక పూట భోజనం అంది స్తున్నారు. 7నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రెండు విడతలుగా 16 గుడ్లు, 2.5 కేజీల బాలా మృతం అందిస్తన్నారు. కేంద్రాల్లో చదువు పూర్తయిన పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కేంద్రాల్లో కొత్త గా చేరిన పిల్లలకు అక్షరా భ్యాసం, అన్నప్రాసన చేస్తున్నారు. 

ప్రతీ చిన్నారి పేరిట ప్రొఫైల్‌...

చిన్నారుల వివరాలన్నీ అంగన్‌ వాడీ కేంద్రాల టీచర్ల వద్ద ఉంటాయి. ప్రతీ చిన్నారి వివరాలు పద్ధతిగా నమోదు చేసి ప్రభుత్వ పాఠశాలలో చేరే వరకు రికార్డు రూపంలో భద్రపరచాలని నిర్ణయించింది. ప్రతీ చిన్నా రి వివరాలను నమోదు చేసేందుకు బాలబాలికలకు వేర్వేరుగా ప్రత్యేక పుస్తకాలను కేంద్రాలకు అందించారు. ప్రతీనెల ఒకటవ తేదిన చిన్నారి వి వరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏటా చిన్నారి ఫొటో సేకరించి, ఐదేళ్ల ప్రొఫైల్‌ కార్డుపై అతికించాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు అధికారులు వచ్చిన సందర్బాల్లో సంబంధిత వివరాలు అందించి ఆరోగ్య శాఖ నిపునులు సూచించిన ప్రమాణాలు లేకపోతే పోషక విలువల లో పం ఉన్నవారిగా గుర్తించి ప్రత్యేక బలవర్ధక ఆహారం అందిస్తారు.

పోషకాహార లోపాలను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు

 బోనగిరి నరేశ్‌, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి, జగిత్యాల

అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. పిల్లలను సాధారణ, సామ్‌, మామ్‌ కేటగిరిల కింద గుర్తిస్తున్నాము. పోషణ లోపాన్ని అదిగమించడానికి కృషి చేస్తున్నా ము. పిల్లల మరణాలు నివారించడం, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచ డం, పోషాకాహార లోపాలను సవరించడం, బడిమానివేతను తగ్గించ డానికి అవసరమైన పనులు నిర్వహిస్తున్నాము.

Updated Date - 2022-06-27T06:23:40+05:30 IST