WORLD’S LARGEST PASSENGER ELEVATOR: అమ్మ బాబోయ్.. ఇదెక్కడి లిఫ్ట్ దేవుడా.. ఒకేసారి అంతమంది ఎక్కొచ్చా..!

ABN , First Publish Date - 2022-05-21T21:47:33+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరంలో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద Elevator అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని..

WORLD’S LARGEST PASSENGER ELEVATOR: అమ్మ బాబోయ్.. ఇదెక్కడి లిఫ్ట్ దేవుడా.. ఒకేసారి అంతమంది ఎక్కొచ్చా..!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరంలో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద Elevator అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఒకేసారి 235 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న Elevatorను ఏర్పాటు చేశారు. Kone Elevators India సంస్థ ఈ ఎక్కువ సామర్థ్యం కలిగిన ఎలివేటర్‌ను నిర్మించింది. ముంబైలోని BKCలో ఉన్న ఈ ఎలివేటర్ ప్రపంచంలోనే అత్యంత బరువైంది కూడా. ఈ ఎలివేటర్ 16 టన్నుల బరువుతో, 25.78 స్వ్కేర్ మీటర్లలో విస్తరించి ఉంటుంది. ప్రపంచంలోనే ఒకేసారి 235 మందిని తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఒకేఒక్క ఎలివేటర్ ఇదే కావడం విశేషం.



Kone Elevators India మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోష్యన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్‌ను నిర్మించడం, అది కూడా ఇండియాలో అందుబాటులోకి రావడం గర్వ కారణంగా భావిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ముంబైలోని BKC ప్రాంతం ఇలాంటి World-Class Elevators, Escalatorsకు పెట్టింది పేరు. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 188 వరల్డ్ క్లాస్ ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ Kone Elevators India నిర్మించినవే కావడం గమనార్హం. తాజాగా అందుబాటులోకి వచ్చిన 200 మందిని తీసుకెళ్లగలిగే ఈ ఎలివేటర్‌లో ప్రజలు నిశ్చింతగా ఎక్కి వెళ్లవచ్చని, ఆ స్థాయిలో మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఎలివేటర్‌ను నిర్మించామని సదరు సంస్థ పేర్కొంది.



ఐదు ఫ్లోర్స్ వరకూ 200 మందిని తీసుకెళ్లగలిగేలా ఈ ఎలివేటర్‌ను నిర్మించారు. 18 Pulleys, 9 Ropes సాయంతో ఈ ఎలివేటర్ పనిచేస్తుంది. ముంబైలోని Jio World Centre భారత్‌లో ఒక వ్యాపార, సాంస్కృతిక కేంద్రానికి సరికొత్త ల్యాండ్‌మార్క్‌గా ఉంది. ఈ జియో వరల్డ్ సెంటర్‌లో 5 Frieght Eleavators,  74 Guest, Service Elevators, 78 Escalators, 30 Guest Elevatorsను Kone సంస్థ ఇన్‌స్టాల్ చేసింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ అతిపెద్ద ఎలివేటర్ ఐదు ఫ్లోర్స్ మధ్య సెకనుకు ఒక మీటర్ వేగంతో నడుస్తుంది. ఒక అతి పెద్ద సమూహాన్ని ఏకకాలంలో తీసుకెళ్లగలిగే సత్తా ఉండటం ఈ ఎలివేటర్ ప్రత్యేకత. జియో వరల్డ్ సెంటర్ ఇంటీరియర్ డిజైన్‌ను ప్రతిబింబించేలా లోటస్ థీమ్‌తో సీలింగ్ లైట్ ఫామ్స్‌ను ఈ ఎలివేటర్‌లో రూపొందించారు. ఆ బిల్డింగ్ న్యూస్, అప్‌డేట్స్ తెలిసేలా లిఫ్ట్ వాల్స్‌లో రెండు Info Screens కూడా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ ఎలివేటర్‌లో ఆ కాసేపు ప్రయాణం మధురానుభూతిని ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదు.

Updated Date - 2022-05-21T21:47:33+05:30 IST