చెక్‌డ్యాం పనులను పరిశీలిస్తున్న సీఈ
బషీరాబాద్, మే 20 : చెక్‌డ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సీఈ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) ధర్మా కాంట్రాక్టర్‌కు సూచించారు. శక్రవారం మండలంలోని జీవన్గి వద్ద కాగ్నానదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. వర్షాకాలంలో నదిలో వరద నీటి ఉధృతికి పనులు జరగక అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాంట్రాక్టర్ తిరిగి పనులు ప్రారంభించడంతో సీఈ పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో ఎస్‌ఈ రంగారెడ్డి, వికారాబాద్ ఈఈ సుందర్, డీఈ కిష్టయ్య, ఏఈ సాయి, వర్క్ ఇన్స్‌పెక్టర్ శ్రవణ్, కాంట్రాక్టర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.