నాడు పూజలందుకుని.. నేడు చీకటి గదిలో..

ABN , First Publish Date - 2021-12-30T05:05:45+05:30 IST

జొన్నవాడ కామాక్షితాయి ఆలయం చుట్టూ పరివార దేవతల విగ్రహాలవి. మూడేళ్ల క్రితం వరకు పూజలందుకున్న ఆ విగ్రహాలు ఇప్పుడు ఓ చీకటి గదిలో మగ్గుతున్నాయి.

నాడు పూజలందుకుని..  నేడు చీకటి గదిలో..
ఓ గదిలో ఉన్న విగ్రహాలు

 బుచ్చిరెడ్డిపాళెం : జొన్నవాడ కామాక్షితాయి ఆలయం చుట్టూ పరివార దేవతల విగ్రహాలవి. మూడేళ్ల క్రితం వరకు పూజలందుకున్న ఆ విగ్రహాలు ఇప్పుడు ఓ చీకటి గదిలో మగ్గుతున్నాయి.  విస్తరణ, అభివృద్ధి పేరుతో ఆలయం చుట్టూ ఉన్న పరివార దేవతలు, నవగ్రహాల విగ్రహాలను కళావిహీనం చేసి తారకేశ్వరస్వామి ఆలయంలోని ఓ గదిలో ధాన్యాగారంలో భద్రపరిచారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి దాతల సహకారంతో కొత్త పరివార దేవతలను ప్రతిష్ఠించారు. పాత నవగ్రహాలకూ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కానీ, ఒకప్పటి పరివార దేవతల విగ్రహాలను మాత్రం చీకటి గదిలోనే వదిలేశారు. ఇలా చేయడం అరిష్టమని, ఈ విగ్రహాల విషయంలో పండితుల సూచన మేరకు ఒక నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2021-12-30T05:05:45+05:30 IST