చీరాలలోని 33 వార్డులలో టీడీపీ పోటీ

ABN , First Publish Date - 2021-03-02T06:47:55+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల లో తెలుగుదేశం పార్టీ తరఫున 33 వార్డుల లో పోటీ ఉంటుంది..

చీరాలలోని 33 వార్డులలో టీడీపీ పోటీ
మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌బాబు

కొన్నిచోట్ల స్వతంత్రులను 

కలుపుకుంటాం

పరిశీలకులు సలగల

చీరాల, మార్చి 1 : ‘మున్సిపల్‌ ఎన్నికల లో తెలుగుదేశం పార్టీ తరఫున 33 వార్డుల లో పోటీ ఉంటుంది.. అందుకు తమ పార్టీ వారితో పాటు స్వతంత్రులనూ కలుపుకుం టాం.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం.. ఇప్పటికే మా అభ్యర్థులపై పలు రకాల ఒ త్తిళ్లు తెస్తున్నారు.. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు..  టీడీపీ చైర్మన్‌గా పార్టీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తాం’ అని టీ డీపీ రాష్ట్ర కార్యదర్శి, చీరాల మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు సలగల రాజశేఖర్‌బాబు చెప్పారు. స్థానిక సాయికృష్ణ రెసిడెన్సీలో సో మవారం పట్టణ పార్టీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చంద్రమౌళి, కర్ణ శ్రీనివాసరావు, పులి వెంకట్రావులతో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి య డం బాలాజీ అనారోగ్యకారణాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. గత నోటిఫికేషన్‌ సమయంలో తమ పార్టీ తరఫున 16 వార్డుల్లో మాత్రమే కౌన్సిలర్లుగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీకి మద్దతు తెలపటంతో 33 వార్డులకు నా మినేషన్లు దాఖలు చేయలేకపోయారని చె ప్పారు. తమ పార్టీ అభ్యర్థులున్న 16 వార్డులతో పాటు మిగిలిన 17 వార్డుల్లో ఉన్న స్వంతంత్రుల్లో భావసారూప్యం అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక స్థానాల్లో గెలిచిచూపిస్తామన్నారు. అనంతరం నామినేషన్లు వేసిన అభ్యర్థులు, కార్యకర్తలతో అంతరంగిక సమావేశం నిర్వహించారు.



Updated Date - 2021-03-02T06:47:55+05:30 IST