కొవిడ్ డ్యూటీలో ఉన్న డాక్టర్లకు చెఫ్ సంజీవ్ కపూర్ ఉచిత భోజనం

ABN , First Publish Date - 2021-05-06T11:50:11+05:30 IST

కరోనా ప్రబలుతున్న కష్టకాలంలో సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ముందుకు వచ్చి వైద్యులకు భోజన సదుపాయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకున్నారు....

కొవిడ్ డ్యూటీలో ఉన్న డాక్టర్లకు చెఫ్ సంజీవ్ కపూర్ ఉచిత భోజనం

అహ్మదాబాద్ (గుజరాత్): కరోనా ప్రబలుతున్న కష్టకాలంలో సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ముందుకు వచ్చి వైద్యులకు భోజన సదుపాయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సివిల్ ఆసుపత్రిలో 500 మంది వైద్యులు కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ రోగుల డ్యూటీలో ఉన్న 500 మంది ఉద్యోగులకు చెఫ్ సంజీవ్ కపూర్ మూడు పూటలా ఆహారం వండి వడ్డిస్తూ ఆదర్శంగా నిలిచారు. వైద్యులకు ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించగానే సంజీవ్ కపూర్ కు స్థానికంగా దాతల నుంచి విరాళాలు వచ్చాయి. దీంతో 12 మంది చెఫ్ లను నియమించి సంజీవ్ కపూర్ డాక్టర్లకు భోజనం పెడుతున్నారు. 1200 పడకల సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ఆసియాలోనే అతి పెద్దది. కొవిడ్ డ్యూటీలో ఉన్న వైద్యులకు మంచి బలవర్ధకమైన ఆహారం అందిస్తే వారు రెట్టించిన ఉత్సాహంతో రోగులకు వైద్యసేవలు చేస్తారని సంజీవ్ కపూర్ చెప్పారు. గత రెండురోజుల క్రితం వైద్యులకు తాను ఉచితంగా భోజనం అందిస్తానని సంజీవ్ కపూర్ ప్రతిపాదించడంతో తాము అంగీకరించి అమలు చేస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు. 

Updated Date - 2021-05-06T11:50:11+05:30 IST