పాకిస్థాన్‌లో రేపిస్టులకు ఉరి

ABN , First Publish Date - 2020-11-26T09:40:01+05:30 IST

పాకిస్థాన్‌లో అత్యాచార నిందితులకు గరిష్ఠంగా ఉరి శిక్ష విధిస్తారు. లేదా రసాయన చర్య ద్వారా లైంగిక పటు త్వం తగ్గిపోయేలా

పాకిస్థాన్‌లో రేపిస్టులకు ఉరి

ఇస్లామాబాద్‌, నవంబరు 25: పాకిస్థాన్‌లో అత్యాచార నిందితులకు గరిష్ఠంగా ఉరి శిక్ష విధిస్తారు. లేదా రసాయన చర్య ద్వారా లైంగిక పటు త్వం తగ్గిపోయేలా(కెమికల్‌ క్యాస్ట్రేషన్‌) చేస్తారు. ఈ మేరకు రెండు ఆర్డినె న్సులను ఇమ్రాన్‌ఖాన్‌ కేబినెట్‌ బుధవారం ఆమోదించింది. ఈ ఆర్డినెన్సులో వారంలో అమల్లోకి వస్తాయని పాక్‌ మంత్రి షిబ్లి ఫరాజ్‌ తెలిపారు. అలాగే, పాకిస్థాన్‌ శిక్షాస్మృతిలో తొలిసారిగా ‘అత్యాచారం’ పదానికి గ్యాంగ్‌రేప్‌, ట్రాన్స్‌జెండర్‌ పదాలను చేర్చారు. వివాదాస్పదమైన ‘టు-ఫింగర్‌’ టెస్ట్‌ను కూడా నిషేధించారు. రేప్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. 

Updated Date - 2020-11-26T09:40:01+05:30 IST