బసవణ్ణ తత్వాలు పాటించేలా చేద్దాం

ABN , First Publish Date - 2022-05-04T17:45:33+05:30 IST

బసవణ్ణ తత్వాలు నేటి సమాజం పాటించేలా చేద్దాం రండి అంటూ ప్రముఖ సాహితీవేత్త నాడోజ గోరు చెన్నబసప్ప పిలుపునిచ్చారు. వచన జ్యోతి బళగ అధ్యక్షుడు పినాకపాణి నేతృత్వంలో బెంగళూరు

బసవణ్ణ తత్వాలు పాటించేలా చేద్దాం

                                             - సాహితీవేత్త చెన్నబసప్ప


బెంగళూరు: బసవణ్ణ తత్వాలు నేటి సమాజం పాటించేలా చేద్దాం రండి అంటూ ప్రముఖ సాహితీవేత్త నాడోజ గోరు చెన్నబసప్ప పిలుపునిచ్చారు. వచన జ్యోతి బళగ అధ్యక్షుడు పినాకపాణి నేతృత్వంలో బెంగళూరు విజయనగర్‌లో బ సవ జయంతి వేడుకలను చెన్నబసప్ప లాంఛనంగా ప్రారంభించారు. బసవణ్ణ ఆశయాలకు అనుగుణంగా నడక చేపడదామన్నారు. ఎనిమిది శతాబ్దాల కిందటే సమసమాజం సాధిద్దామనే బసవణ్ణ ఆలోచనలు నేటి సమాజానికి అత్యవసరమనే పరిస్థితి ఏర్పడిందన్నారు. బసవ కల్యాణలో అనుభవ మండపం నిర్మాణమవుతోందని, ఇదే సందర్భంలో సమాజంలో బసవణ్ణ ఆదర్శాలను ప్రచారం చేద్దామన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాధికార అధ్యక్షుడు డాక్టర్‌ సీ సోమశేఖర్‌ మాట్లాడుతూ బసవణ్ణ వచనాలు ఎంతో శ్రద్ధగా పాడతామని, కనీసం ఒకటి రెండైనా పాటించేందుకు సిద్ధం కావాలన్నారు. వచనజ్యోతి అధ్యక్షుడు పినాకపాణి మాట్లాడుతూ బసవణ్ణ జయంతి అంటే బసవేశ్వరుడికి జరిపే వేడుక కాదని, మహాగురువు తత్వాలను స్మరించుకునే వేడుక అని కొనియాడారు. విజయనగర వీధులలో బసవణ్ణ ఊరేగింపు డొళ్లుకుణిత, వీరగాస వంటి సంప్రదాయ నృత్యాలు సాగాయి. బీయుటీసీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మునిరాజప్ప, కన్నడ అధ్యాపకులు రుద్రేష్‌ అదరంగి, రుద్రప్ప దేశాయ్‌, పంపనగౌడ మేల్సీమ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయవిజయీభవ, పారిశ్రామికవేత్త గురుప్రసాద్‌ కుచ్చంగి, ఏఎస్‌బీ గ్రూపు సంస్థల అధినేత భగీరథ్‌, డా క్టర్‌ అనుపమ పాల్గొన్నారు. కళాకారులు, అభిమానులు ఊరేగింపులో నృత్యాలు చేశారు.

Read more