Chennai కార్పొరేషన్‌లో 15 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు

ABN , First Publish Date - 2022-02-10T14:34:38+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా ఉన్న కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రస్తుతం పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల పంపిణీ జరుగుతోందని, గురువారం నుంచి

Chennai కార్పొరేషన్‌లో 15 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు

- పోలింగ్‌ సిబ్బందికి తపాలా ఓట్లు

- పార్టీలకు 168 ప్రచార స్థలాలు

- 5794 పోలింగ్‌ కేంద్రాలు


చెన్నై: గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా ఉన్న కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రస్తుతం పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల పంపిణీ జరుగుతోందని, గురువారం నుంచి పోలింగ్‌ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి తపాలా ఓట్లను పంపుతామని ఆయన చెప్పారు. నగరంలోని 200 వార్డులకుగాను 5794 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, ఈ కేంద్రాలకు కరోనా నిరోధక వస్తువుల పెట్టెలను కూడా పంపిస్తున్నామన్నారు. పోలింగ్‌ సిబ్బందికి, ఓటు వేసేందుకు వచ్చే కరోనా బాధితులకు శానిటైజర్లు, మాస్కులు, థర్మల్‌స్కాన్‌ పరికరాలు ఉపయోగించనున్నామని తెలిపారు. ఈ నెల 19న పోలింగ్‌ పూర్తయిన తర్వాత నగరంలో 15 చోట్ల ఏర్పాట్లు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను గట్టి పోలీసు బందోబస్తు మధ్య తరలిస్తామని, ఈ నెల 22న కౌంటింగ్‌ జరుగుతుందని చెప్పారు. నగరంలో 1 నుంచి 14 వార్డులకు పోలైన ఓట్లను తిరువొత్తియూరు వెల్లయ్యన్‌ శెట్టియార్‌ మెట్రిక్యులేషన్‌ ఉన్నత పాఠశాల కౌంటింగ్‌ కేంద్రంలోను, 15 నుంచి 22 వార్డుల ఓట్లు మనలి ప్రభుత్వ మహోన్నత పాఠశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 23 నుంచి 33 వార్డుల ఓట్లు సూరపట్టు వేలమ్మాల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలోనూ లెక్కించనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా 34 నుంచి 48 వార్డుల్లో పోలైన ఓట్లను ఆర్కేనగర్‌ పాలి టెక్నిక్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 49 నుంచి 63 వార్డుల ఓట్లను బ్రాడ్వే భారతి మహిళా కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 64 నుంచి 78 వార్డుల ఓట్లను పురుష వాక్కంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 79 నుంచి 93 వార్డుల ఓటు ముగప్పేర్‌ ఈస్ట్‌ తాయ్‌ మూగాంబికైపాలి టెక్నిక్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 94 నుంచి 108 వారులకు పచ్చయప్ప కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 109 నుంచి 126 వార్డుల్లో పోలైన ఓట్లను లయోలా కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో లెక్కించనున్నారు. 127 నుంచి 142 వార్డుల్లో పోలైన ఓట్లను విరుగంబాక్కం మీనాక్షి ఇంజనీరింగ్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 143 నుంచి 155 వార్డులకు మధురవాయల్‌ ఎంజీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 156 నుంచి 167 వార్డులకు ఆలందూరు ఏజేఎస్‌ నిధి మహోన్నత పాఠశాల కౌంటింగ్‌ కేంద్రంలోను, 168 నుంచి 180 వార్డులకు గిండిఅన్నా విశ్వవిద్యాలయం కౌంటింగ్‌ కేంద్రంలో, 181 నుంచి 191 వార్డు ఓట్లను పళ్ళికరణై జెరూసలేమ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో, 192 నుంచి 200 వార్డులలో పోలైన ఓట్లను చోళింగనల్లూరు మహమ్మద్‌ సదక్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలోనూ లెక్కించనున్నారు. పోలింగ్‌ సిబ్బంది ఓటు హక్కును వినియో గించుకోవ డానికి వీలుగా ఈ నెల 10 నుంచి తపాలా బ్యాలెట్లను అందజేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాల సిబ్బందికి ఇంటిదగ్గరే ఈ తపాలా బ్యాలెట్లను అందజేస్తారు. పోలింగ్‌ సిబ్బంది తపాలాబ్యాలెట్లలో తమఓటు హక్కు వినియోగించుకుని వాటిని తపాలా ద్వారా గాని, ప్రాంతీయ ఎన్నికల అధికారులకు నేరుగా అందజే యవచ్చునని గగన్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. ఇక నగరంలో ప్రధాన రాజకీయ పార్టీలు 168 స్థలాల్లో ప్రచారం చేసుకోవడానికి గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ అనుమతిచ్చారు. ఆయా స్థలాల్లో కొవిడ్‌ నిబంధనలతో వెయ్యిమంది దాటకుండా సభలు నిర్వహించుకోవచ్చని, ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకూ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేసుకోవచ్చునని, అయితే ఈ ప్రచారానికి స్థానిక పోలీసు స్టేషన్లలో అనుమతి తీసుకోవాలని తెలిపారు.

Updated Date - 2022-02-10T14:34:38+05:30 IST