చెన్నై చేరుకున్న జనం

ABN , First Publish Date - 2022-01-19T13:54:00+05:30 IST

సంక్రాంతి సెలవులకు నగరం నుంచి వెళ్ళిన వారందరూ పండుగ వేడుకలను ముగించుకుని తిరుగు ముఖం పట్టడంతో మంగళవారం వేకువ జామున కోయంబేడులో ట్రాఫిక్‌ స్తంభిం చింది. స్వస్థలాలకు వెళ్ళినవారి కోసం, నగరానికి తిరిగి వస్తు

చెన్నై చేరుకున్న జనం

                          - కోయంబేడులో స్తంభించిన ట్రాఫిక్‌


చెన్నై: సంక్రాంతి సెలవులకు నగరం నుంచి వెళ్ళిన వారందరూ పండుగ వేడుకలను ముగించుకుని తిరుగు ముఖం పట్టడంతో మంగళవారం వేకువ జామున కోయంబేడులో ట్రాఫిక్‌ స్తంభిం చింది. స్వస్థలాలకు వెళ్ళినవారి కోసం, నగరానికి తిరిగి వస్తున్నవారి కోసం రాష్ట్ర రవాణా సంస్థ రోజువారీ బస్సుల సహా  సుమారు 16 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ఐదు రోజుల సెలవు తర్వాత స్వస్థలాలకు వెళ్ళినవారంతా సోమవారం రాత్రే  రాజధాని నగరం చెన్న్జ్జైకి పయనమయ్యారు. మంగళవారం నగరానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని ముందుగానే భావించిన రవాణ సంస్థ అధికారులు సోమవారం రాత్రి నుంచి ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలకు చెందిన నగరాల నుంచి ప్రయాణికులు మంగళవారం వేకువజాము కోయంబేడు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రవాణా సంస్థ బస్సులతో పోటీ పడేలా ఆమ్నీ బస్సులు కూడా వివిధ నగరాల నుంచి కోయంబేడు చేరుకున్నారు. వేకువ జామున సుమారు రెండు వేలమందికి పైగా కోయంబేడు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సందర్భంగా వడపళని - ఎంఎండీఏ జంక్షన్‌ నుంచి కోయంబేడు బస్‌స్టేషన్‌ ప్రాంతం వరకూ రెండు వైపులా ఉన్న వందడుగుల రోడ్డులో వందల సంఖ్యలో రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సులు, వ్యాన్లు, కార్లు నిలిచిపోయాయి. దీనితో బస్సుల్లో ప్రయాణికులు దిగి ఆటోల్లో గమ్యస్థానాలకు ఆదరాబాదరాగా బయల్దేరారు. ట్రాఫిక్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి సుమారు గంట సేపు శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. 

Updated Date - 2022-01-19T13:54:00+05:30 IST