చెన్నైలో అర్ధరాత్రి కార్‌ రేస్‌

ABN , First Publish Date - 2022-04-17T15:21:17+05:30 IST

నగరంలో శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన రేస్‌లో పాల్గొన్న కారు రోడ్డుపై నిలిపిన వ్యాన్‌ను ఢీకొనడంతో ఓ మహిళకు స్వల్పగాయాలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మెరీనా బీచ్‌

చెన్నైలో అర్ధరాత్రి కార్‌ రేస్‌

                             - వ్యాన్‌ను ఢీకొన్న కారు


ఐసిఎఫ్‌(చెన్నై): నగరంలో శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన రేస్‌లో పాల్గొన్న కారు రోడ్డుపై నిలిపిన వ్యాన్‌ను ఢీకొనడంతో ఓ మహిళకు స్వల్పగాయాలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మెరీనా బీచ్‌ నుంచి నుంగంబాక్కం రోడ్డు వైపునకు మూడు కార్లు అతి వేగంగా వెళ్లాయి. ఆరేక్‌ రోడ్డులోని ప్రముఖ హోటల్‌ ముందు నిలిపిన వ్యాన్‌ను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌లో కూర్చున్న ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన శాంతి (55)కి స్వల్పగాయాలు కాగా, మరికొందరు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. కారు నడుపుతున్న యువకులు తమ సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందించడంతో మరో ఐదు కార్లలో వచ్చిన 20 మంది యువకులతో అతడు వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కారు, వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, కారులో వాకీటాకీ ఉండడం గుర్తించారు. అనంతరం ఘటనకు బాధ్యుడైన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. అతడు ముఖ్య ప్రముఖుడి కుమారుడని విచారణలో తెలిసినట్లు సమాచారం.

Updated Date - 2022-04-17T15:21:17+05:30 IST