హస్సీకి నెగెటివ్‌..సాహాకు పాజిటివ్‌

May 15 2021 @ 03:51AM

చెన్నై: ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. అతడికి కరోనా నెగెటివ్‌గా వచ్చింది. కాగా, ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహాకు మాత్రం రెండుసార్లు నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో ఒకటి నెగెటివ్‌, మరొకటి పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు మరికొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. ఐపీఎల్‌ సందర్భంగా హస్సీ, సాహా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. 38 సభ్యుల ఆస్ట్రేలియా బృందం ఆదివారం ప్రత్యేక విమానంలో మాల్దీవుల నుంచి ఆసీస్‌ వెళ్లనుంది. హస్సీ కూడా వీరితో కలిసి వెళ్లే అవకాశం ఉంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.