
- 31 వరకు నగరంలోనే పర్యటన
చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చెన్నై విచ్చేశారు. గురువారం సాయంత్రం ప్రత్యేక విమానం ద్వారం చెన్నై చేరిన ఉపరాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, పర్యావరణశాఖ మంత్రి ఎం. .మెయ్యనాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు స్వాగతం పలికారు. తొమ్మిదిరోజుల పర్యటన కోసం నగరానికి వచ్చిన వెంకయ్య.. ఇక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈనెల 25వ తేదీన వెంకయ్య దివంగత మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో పాల్గొని, నివాళుర్పించనున్నారు. అదేవిధంగా 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు తాజ్‌కోరమాండల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో దివంగత డాక్టర్ వీఎల్ దత్ ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తిరిగి ఆయన ఈనెల 31వ తేదీన చెన్నై నుంచి కొచ్చిన్ బయలుదేరి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి