చెన్నైకో గెలుపు!

ABN , First Publish Date - 2020-10-27T09:19:33+05:30 IST

టోర్నీ ప్లేఆఫ్స్‌ దారులన్నీ మూసుకుపోయిన వేళ చెన్నై జూలు విదిల్చింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి, టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన

చెన్నైకో గెలుపు!

8 వికెట్లతో బెంగళూరుకు షాక్‌

దుబాయ్‌: టోర్నీ ప్లేఆఫ్స్‌ దారులన్నీ మూసుకుపోయిన వేళ చెన్నై జూలు విదిల్చింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి, టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన బెంగళూరును కంగుతినిపించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (65 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో సత్తా చాటగా..ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 145/6 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌ కోహ్లీ (50) హాఫ్‌ సెంచరీ చేయగా..డివిల్లీర్స్‌ (39), పడిక్కళ్‌ (22) పర్లేదనిపించారు. కర్రాన్‌ (3/19) మూడు, చాహర్‌ (2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని చెన్నై 18.4 ఓవర్లలో 150/2 స్కోరుతో ఛేదించింది. రాయుడు (39), డుప్లెసి (25) రాణించారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.


సంక్షిప్తస్కోరు: బెంగళూరు 20 ఓవర్లలో 145/6 (కోహ్లీ 50, డివిల్లీర్స్‌ 39, పడిక్కళ్‌ 22, ఫించ్‌ 15, కర్రాన్‌ 3/19, చాహర్‌ 2/31, శాంట్నర్‌ 1/23);

చెన్నై: 18.4 ఓవర్లలో 150/2 (పడిక్కళ్‌ 65 నాటౌట్‌, రాయుడు 39, డుప్లెసి 25, ధోనీ 19 నాటౌట్‌, చాహల్‌ 1/21, మోరిస్‌ 1/36).

Updated Date - 2020-10-27T09:19:33+05:30 IST